Jio Cheapest 5G Phone : భారత్‌లోనే అత్యంత చౌకైన జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ముఖేష్ అంబానీ ప్లాన్ అదిరింది..!

Jio Cheapest 5G Phone : లీక్‌ డేటా ప్రకారం.. రాబోయే రిలయన్స్ జియో 5G ఫోన్‌కు 'గంగా' అనే కోడ్‌నేమ్ ఉంది. శాంసంగ్ 4GB LPPDDR4X RAM, మైక్రో SD కార్డ్‌తో 32GB స్టోరేజీ కలిగి ఉంది.

Jio Cheapest 5G Phone : భారత్‌లోనే అత్యంత చౌకైన జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ముఖేష్ అంబానీ ప్లాన్ అదిరింది..!

Mukesh Ambani likely to launch India’s cheapest 5G phone this year, details leaked

Jio Cheapest 5G Phone : ప్రముఖ భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సరికొత్త 5G ఫోన్ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దేశీయ మార్కెట్లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో పాటు గణనీయంగా పెట్టుబడి పెట్టాడు. రిలయన్స్ జియో కంపెనీ నుంచి అందిన కీలక డేటా ప్రకారం.. అతి త్వరలో సరసమైన 4G స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ ప్లాన్‌లను తీసుకొస్తుంది.

రిలయన్స్ జియో ప్రొడక్టులను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ముఖేష్ అంబానీ కొత్త వ్యూహాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రాబోయే జియో 5G ఫోన్ దేశంలోనే అత్యంత చౌకైన ధరకే రానుంది. నివేదికల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంబానీ ఈ ఏడాది చివరిలో జరిగే కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) కొత్త Jio 5G ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.

Read Also : OnePlus Nord 3 5G : వన్‌ప్లస్ నార్డ్ 3 సిరీస్ 5G ఫోన్ కెమెరా ఫీచర్లు లీక్.. జూలై 5నే లాంచ్..!

జియో 5G ఫోన్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఏమీ వెల్లడించలేదు.టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. జియో 5G స్మార్ట్‌ఫోన్ ఫొటోను ఆయన ట్వీట్‌లో షేర్ చేశారు. ఈ ఫోన్ ఎలా ఉంటుందో చూడవచ్చు. లీక్‌స్టర్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. కొత్త జియో ఫోన్ 5G హుడ్ కింద Qualcomm Snapdragon 480+ SoC ద్వారా పవర్ అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ డివైజ్ 2MP సెకండరీ సెన్సార్‌తో పాటు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది.

Mukesh Ambani likely to launch India’s cheapest 5G phone this year, details leaked

Mukesh Ambani likely to launch India’s cheapest 5G phone this year, details leaked

వీడియో కాల్‌లు, సెల్ఫీలకు ఫోన్‌లో 8MP కెమెరా లభిస్తుందని భావిస్తున్నారు. ఈ డివైజ్ 5000mAh బ్యాటరీతో సపోర్టుతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తోంది. గతంలో లీక్‌ల ప్రకారం.. జియో 5G ఫోన్‌కు ‘గంగా’ అనే కోడ్‌నేమ్ ఉంది. శాంసంగ్ 4GB LPPDDR4X RAM, మైక్రో SD కార్డ్‌తో 32GB స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. ఈ జియో 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లేను పొందే అవకాశం ఉంది.

Read Also : Apple New Headphones : యూఎస్‌బీ-C పోర్టుతో ఆపిల్ కొత్త హెడ్‌ఫోన్లు.. లాంచ్ ఎప్పుడో తెలుసా?