Petrol Rate Today : 30 రోజులుగా పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు

దేశీయంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు జరగలేదు.

Petrol Rate Today : 30 రోజులుగా పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు

Petrol Rate Today

Updated On : August 16, 2021 / 8:00 AM IST

Petrol Rate Today : దేశీయంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు జరగలేదు. రేట్లు పెరగకపోయినా ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారింది. లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీదాటిపోవడంతో వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు జనాలు. డీజిల్ ధరలు కూడా వందకు చేరువలో ఉడటంతో ప్రజలు తన వాహనాలను గతంలోలా బయటకు తీయడం లేదు.

ఇక దేశంలోని వివిధ నగరాల్లోని పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే..

ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా, డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా, డీజిల్ ధర రూ.94.39గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 ఉండగా, డీజిల్ ధర రూ.95.26 గా ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 97.10గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉండగా లీటర్ డీజిల్ 98.13గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.97.53గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.03 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.62గా ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.04 ఉండగా,. డీజిల్ ధర రూ. 98.65గా ఉంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.16లకు లభిస్తుండగా, డీజిల్ ధర రూ.98.76గా ఉంది.