Vi Navratri Offers 2023 : వోడాఫోన్ ఐడియా ‘నవరాత్రి’ ఆఫర్లు.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై అదనపు డేటా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్ర్కిప్షన్..!
Vodafone Idea Navratri Offers 2023 : వోడాఫోన్ ఐడియా యూజర్లకు పండుగ ఆఫర్లు అందిస్తోంది. నవరాత్రి ఆఫర్ కింద ఎంపిక (Vi Navratri Offers 2023) చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.

Navratri Offers 2023 _ Vodafone Idea rolls out Disney Plus Hotstar Mobile access on select prepaid plans
Vodafone Idea Navratri Offers 2023 : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం కంపెనీ వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ వినియోగదారులకు ‘నవరాత్రి’ ఆఫర్ (Navratri Offers 2023) కింద ఎంపిక చేసిన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ (Disney+ Hotstar Mobile subscription)కి అదనపు డేటా, ఒక ఏడాదిపాటు యాక్సెస్‌ను అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ వెబ్‌సైట్‌లోని లేటెస్ట్ లిస్టును చూపిస్తుంది.
రూ.1449 ప్లాన్ కింద 30GB ఫ్రీ డేటా :
ఈ నవరాత్రి ఆఫర్ కింద వోడాఫోన్ ఐడియా రూ. 1,449 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అదనంగా 30GB ఉచిత డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, టాక్‌టైమ్, రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు, 10 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో అదనపు బెనిఫిట్స్ కింద (Vi Binge All Night) ఆఫర్, వారాంతపు డేటా రోల్‌ఓవర్, Vi Movies & TV క్లాసిక్ యాక్సెస్, అలాగే (Vi Data Delights) ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటాను అందిస్తాయి.

Vi Navratri Offers 2023
రూ.2899 ప్లాన్ కింద 50GB ఫ్రీ డేటా :
వోడాఫోన్ ఐడియా రూ. 2,899 ప్రీపెయిడ్ ప్లాన్ అదనంగా 50GB ఉచిత డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్వాయిస్ కాల్స్, టాక్‌టైమ్, రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అదనపు బెనిఫిట్స్ కింద ‘బింగే ఆల్ నైట్’, వారాంతపు డేటా రోల్‌ఓవర్, Vi సినిమాలు & టీవీ క్లాసిక్ యాక్సెస్, వోడాఫోన్ ఐడియా డేటా డిలైట్‌లు ఉన్నాయి.
రూ.3099 ప్లాన్ కింద 50GB ఫ్రీ డేటా :
చివరగా, వోడాఫోన్ ఐడియా రూ. 3,099 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ యాక్సెస్, అదనంగా 50GB ఉచిత డేటాను అందించింది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్, టాక్‌టైమ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాతో వస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ నవరాత్రి ఆఫర్ అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25, 2023 వరకు అందుబాటులో ఉంటుందని టెల్కో వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ తెలిపింది.