Call Data : యూజర్ల కాల్‌ డేటాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు… రెండేళ్లు పాటు భద్రపరచాలి

దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రోవైడర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వారి వద్ద ఉన్న ఖాతాదారుల కాల్ రికార్డింగ్ డేటాను, ఇంటర్నెట్ యూస

Call Data : యూజర్ల కాల్‌ డేటాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు… రెండేళ్లు పాటు భద్రపరచాలి

Telephone Data

Call Data :  దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రోవైడర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వారి వద్ద ఉన్న ఖాతాదారుల కాల్ రికార్డింగ్ డేటాను, ఇంటర్నెట్ యూసేజ్ డేటాను రెండేళ్ల పాటు భద్ర పరచాలంటూ  కీలక ఆదేశాలు జారీచేసింది. టెలిఫోన్ ఆపరేటర్లకు టెలికమ్యూనికేషన్స్ శాఖ లైసెన్స్ ఇచ్చేముందు చేసుకునే ఒప్పందంలోని క్లాజ్ నెంబర్ 39.20 ప్రకారం ఈ సమయం గతంలో ఏడాది పాటు ఉండేది.

అవసరం అయితే దేశ భద్రతకు సంబంధించి ఒకవేళ భద్రతా ఏజెన్సీలు   కోరితే ఆ గడువును పెంచే వెసులు బాటు ఉండేది. ప్రభుత్వం ఏడాది పాటు అని చెప్పినా… టెలికాం ప్రొవైడర్లు ఏడాదిన్నర పాటు డేటాను భద్రపరిచేవారు. అప్పడు వాటిని డిలీట్   చేసేటప్పుడు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కు తెలియపరుస్తాయి.  అప్పటికి వారి  నుంచి ఎటువంటి అభ్యర్ధన… సూచన రాకపోతే దానిని ఇంకో 45 రోజులు ఉంచి   డీలీట్ చేసేవి.

Also Reaad : TTD : తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్..55 నిమిషాల్లో అన్నీ బుక్

అయితే ఈ సారి రెండేళ్లపాటు భద్రపరచాలని యూనిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు   సవరణ చేయటం విశేషం.  రెండేళ్ళ పాటు లేదా ప్రభుత్వం   చెప్పేంత వరకు యూజర్ల కాల్ డేటాను, మెసేజ్ లను భద్రపరాచాలని టెలికమ్యూనికేషన్ విభాగం డిసెంబర్ 21న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. భద్రతా పరమైన కారణాల రీత్యా యూజర్ల కాల్ రికార్డింగ్, మెసేజ్ వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ మెయిల్ లాగిన్,లాగవుట్ ఇలా అన్నివివరాలను భద్రపరచాల్సి ఉంటుంది.

ఈసారి కొత్త నిబంధనల ప్రకారం యాప్‌ల  ద్వారా చేసే కాల్స్,  వైఫై కాల్స్ వివరాలను, ఐపీ అడ్రస్‌లను  కూడా ఈసారి రెండేళ్లపాటు భద్రపరచాల్సి ఉంటుంది. ఈ లోగా భద్రతా, దర్యాప్తు, విచారణ ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాలు కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయమై ఒక టెలికం కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ… ఈవివరాలు ఎక్కువ    స్పేస్ తీసుకోవు..టెక్స్ట్ ఫార్మాట్ లో నిల్వ చేయబడి ఉన్నందున ఈ డేటాను రెండేళ్లపాటు ఉంచటం వలన ఎటువంటి అదనపు ఖర్చులు ఉండవని చెప్పారు.