TTD : తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్..55 నిమిషాల్లో అన్నీ బుక్

టీటీడీ వెబ్ సైట్ కు 14 లక్షల హిట్లు వచ్చాయి. మొత్తం 4 లక్షల 60 వేల టికెట్లు విడుదల చేయగా..ఇవన్నీ కేవలం 55 నిమిషాల వ్యవధిలో బుక్ కావడం విశేషం.

TTD : తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్..55 నిమిషాల్లో అన్నీ బుక్

Ttd Online Booking

Online TTD Ticket Booking : తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే..శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటుంటారు భక్తులు. దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించగానే..ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇలా రిలీజ్ అవుతాయో లేదో..క్షణాల్లో టికెట్లు బుక్ అయిపోతాయి. టీటీడీ ఆన్ లైన్ లో నిర్వహించే ఈ టికెట్లు శ్రీవారి భక్తులు కొనుగోలు చేస్తుంటారు. 2021, డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం టీటీడీ ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేసింది. మొత్తం 4 లక్షల 60 వేల టికెట్లు విడుదల చేయగా..ఇవన్నీ కేవలం 55 నిమిషాల వ్యవధిలో బుక్ కావడం విశేషం.

Read More : Subramanian swamy : స్వామి సంచలన ట్వీట్.. యూపీలో రాష్ట్రపతి పాలన?

ఒక్కసారిగా..టీటీడీ వెబ్ సైట్ కు 14 లక్షల హిట్లు వచ్చాయి. అంతమంది రావడంతో సైట్ లో అంతరాయం ఏర్పడుతుందా అని అనుకున్నారు టీటీడీ అధికారులు. కానీ..టికెట్ల కేటాయింపులో ఎలాంటి సమస్య రాలేదు. 2022 జనవరి 01, 13 నుంచి 22వ తేదీ వరకు 20 వేలు టికెట్లు బుక్ అయ్యాయి. అలాగే జనవరి 02వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, 23 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 12 వేల టికెట్లను విడుదల చేసింది టీటీడీ. జనవరి నెలలో 1, 02, 13 నుంచి 22, 26వ తేదీల్లో 5 వేల 500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను గురువారం ఆన్ లైన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని కూడా నిమిషాల వ్యవధిలో బుక్ చేసుకున్నారు భక్తులు.

Read More : Thirumala : నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

2021, డిసెంబర్ 25వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించి రోజుకు 5 వేల చొప్పున మొత్తం లక్షా 55 వేల సర్వదర్శనం టికెట్లను ఇస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం ఆఫ్‌లైన్‌ టికెట్లను తిరుపతిలో డిసెంబర్‌ 31 నుంచి ఇస్తామని, ఆఫ్‌లైన్‌ టోకెన్లు కూడా రోజుకు 5 వేల చొప్పున జారీ చేస్తామన్నారు.