OnePlus Nord 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ 3 త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అవకాశం ఉంది. కంపెనీ నెక్స్ట్ నార్డ్ ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఇప్పటికే ఇతర నార్డ్ లైనప్‌లను అప్‌డేట్ చేసింది.

OnePlus Nord 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord 3 likely to arrive in India as company teases launch of next Nord phone

OnePlus Nord 3 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో (OnePlus Nord 3) త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. కంపెనీ నెక్స్ట్ జనరేషన్ Nord ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఇతర Nord లైనప్‌లను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు (OnePlus Nord 2T) లేదా Nord 2 అప్‌గ్రేడ్ వెర్షన్ ప్రకటించే ఛాన్స్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ చాలా లీక్‌లు ఉన్నాయి. బ్రాండ్ ‘ది ల్యాబ్’ క్యాంపెయిన్‌తో నెక్స్ట్ నార్డ్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది.

అదే అధికారిక వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరమ్‌లో వస్తుంది. ఈ డివైజ్ అధికారిక లాంచ్ తేదీని వన్‌ప్లస్ ఇంకా వెల్లడించలేదు. రాబోయే రోజులు లేదా వారాల్లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్ ఈవెంట్, ప్రొడక్టు పేరు ఇంకా రివీల్ చేయలేదు. ది ల్యాబ్ లాంచ్ ఈవెంట్ ప్రకటించినందుకు సంతోషంగా ఉందని వన్‌ప్లస్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ డివైజ్ ఇతరుల కన్నా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రాబోయే Nord ప్రొడక్టును రివ్యూ చేసేందుకు 6 మంది రివ్యూలర్లను ఎంపిక చేస్తామని వన్‌ప్లస్ ఫోరమ్‌లో పేర్కొంది.

Read Also : OnePlus 10R Lowest Price : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్.. అతి తక్కువ ధరకే వన్‌ప్లస్ 10R సొంతం చేసుకోండి..!

వన్‌ప్లస్ Nord 3 ధర, స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
రాబోయే (OnePlus Nord 3) భారత మార్కెట్లో రూ. 30వేల కన్నా తక్కువ ధరలో ఉండవచ్చని అంచనా. కంపెనీ ఒరిజినల్ Nord సిరీస్ ఫోన్‌లు ధరల రేంజ్ బడ్జెట్ వినియోగదారులే లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ కూడా రూ. 30వేల లోపు ఉంటుందని అంచనా. లీక్‌ల ప్రకారం.. OnePlus Nord 3 ఫోన్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో రావచ్చు. 6.74 అంగుళాల సైజులో ఉంటుంది. అది AMOLED కావచ్చు. ఎందుకంటే.. ఒరిజినల్ Nord సిరీస్ ఫోన్‌లలో ఇదే అందిస్తోంది. ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది.

OnePlus Nord 3 likely to arrive in India as company teases launch of next Nord phone

OnePlus Nord 3 likely to arrive in India as company teases launch of next Nord phone

హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 9000 SoC ఉండవచ్చు. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ చిప్‌సెట్, కంపెనీ లాంచ్ చేసిన OnePlus ప్యాడ్‌కు కూడా పవర్ అందిస్తుంది. వన్‌ప్లస్ Nord 3 వాస్తవానికి అదే చిప్‌ని ఉపయోగిస్తుంటే.. స్పీడ్ పర్ఫార్మెన్స్ పొందవచ్చు. ఈ బ్రాండ్ ఫీచర్ల వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు. వెనుకవైపు, 50MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉండవచ్చు. 8MP సెన్సార్, 2MP కెమెరాతో కూడి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 5G ఫోన్ 16MP కెమెరాను కలిగి ఉంటుంది. కంపెనీ సిగ్నేచర్ అలర్ట్ స్లైడర్ ఫీచర్‌ను అందిస్తుంది. ఇప్పుడు ఎంపిక చేసిన OnePlus ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ Nord 3 ఆండ్రాయిడ్ 14 OS ఇంకా రిలీజ్ కాలేదు. ఆండ్రాయిడ్ 13 OS తో షిప్ అయ్యే అవకాశం ఉంది. OnePlus హుడ్ కింద సాధారణ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కంపెనీ ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. OnePlus Nord 3 ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును పొందవచ్చు. ఈ స్పెసిఫికేషన్లన్నీ లీక్‌లపై ఆధారపడి ఉన్నాయి. రాబోయే Nord ఫోన్ అధికారిక స్పెక్స్, ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. రాబోయే రోజుల్లో లేదా వారాల్లో OnePlus స్మార్ట్‌ఫోన్‌ వివరాలను రివీల్ చేసే అవకాశం ఉంది.

Read Also : Airtel Unlimited 5G Data : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫ్రీ డిస్నీ ప్లస్ సబ్‌స్ర్కిప్షన్, 15కు పైగా ఓటీటీ ఛానల్స్..