PAN-Aadhaar Linking : త్వరపడండి.. నేడే లాస్ట్ డేట్.. లేదంటే రూ.10వేలు ఫైన్..

మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ నెంబర్ తో లింక్ చేశారా? లింక్ చేయకపోతే త్వరపడండి. నేడే(మార్చి 31,2021) లాస్ట్ డేట్. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

PAN-Aadhaar Linking : త్వరపడండి.. నేడే లాస్ట్ డేట్.. లేదంటే రూ.10వేలు ఫైన్..

Pan Aadhaar Linking Last Date

PAN-Aadhaar Linking Last Date : ఏప్రిల్ వచ్చేస్తోంది. ఏప్రిల్ నెల వచ్చిన ప్రతీసారి కొన్ని మార్పులు తప్పనిసరిగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావడమే ఇందుకు కారణం. ఈ నెల నుంచి అనేక మార్పులు ఉంటాయి. కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. ఈసారి కూడా కొన్ని మార్పులు, రూల్స్ రానున్నాయి. అందులో ముఖ్యమైంది పాన్-ఆధార్ లింక్.

పాన్ కార్డు పనికిరాదు.. రూ.10వేలు జరిమానా…
మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ నెంబర్ తో లింక్ చేశారా? లింక్ చేయకపోతే త్వరపడండి. నేడే(మార్చి 31,2021) లాస్ట్ డేట్. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. పాన్, ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. అప్పట్లోగా లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 తర్వాత వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. పాన్-ఆధార్ లింక్ చెయ్యకపోతే.. పాన్ కార్డు నిరుపయోగంగా మారుతుంది. మీ దగ్గర పాన్ కార్డు ఉన్నా ఎందకూ పనికి రాదు. అలాంటి వారిపై ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు ఐటీ యాక్ట్ సెక్షన్ 272బీ కింద రూ.10వేలు జరిమానా కూడా విధించొచ్చు.

ఆధార్ తో పాన్ లింక్ చేయని పక్షంలో ఏం జరుగుతుంది..
మనం బ్యాంకుకి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. లేదా 50వేలకు మించి డిపాజిట్ లేదా విత్ డ్రా చేయాలన్నా పాన్ కార్డు మస్ట్. ఒకవేళ తప్పుడు పాన్ నెంబర్ లేదా నిరుపయోగంగా ఉన్న పాన్ నెంబర్ ఇస్తే.. నేరంగా పరిగణిస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఐటీ యాక్ట్ కింద రూ.10వేలు ఫైన్ విధిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా, బ్యాంకు కార్యకలాపాలు చేయాలన్నా పాన్ కార్డు చాలా అవసరం. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు మస్ట్. మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లు కొనాలన్నా పాన్ తప్పనిసరి. అంతేకాదు రూ.50వేలకు పైగా లావాదేవీలు జరపాలంటే పాన్ అవసరం. ఈ క్రమంలో కేంద్రం తెచ్చిన నిబంధన ప్రకారం.. పాన్-ఆధార్ లింక్ చేస్తేనే పాన్ కార్డు యాక్టివ్ లో ఉన్నట్టు. లేదంటే పాన్ కార్డు ఎందుకూ పనికిరానట్టే.

ఆధార్, పాన్ కార్డు లింకింగ్ ప్రాసెస్ కు కేంద్రం పలుమార్లు గడువు పొడిగించింది. అయినప్పటికీ ఇంకా కొంతమంది తమ కార్డులను లింక్ చేసుకోలేకపోయారు. ఇప్పటివరకూ ఆధార్, పాన్ లింక్ చేసుకోనివారు ఎలా లింక్ చేసుకోవాలంటే..

పాన్ కార్డుతో ఆధార్‌ లింక్ ఇలా.. ఆన్‌లైన్‌లో..
* ముందుగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ(ఐటీ) ఈ ఫైలింగ్ పోర్ట‌ల్ https://incometaxindiaefiling.gov.in/ ఓపెన్ చేయాలి.
* త‌ర్వాత అందులో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. పాన్ కార్డు నెంబర్ యూజ‌ర్ ఐడీగా ఉంటుంది.
* రిజిస్ట‌ర్ అయిన త‌ర్వాత యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్, పుట్టిన తేదీ వివ‌రాల‌తో లాగిన్ అవ్వాలి.
* లాగిన్ అవ్వ‌గానే పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాల‌ని ఒక పాపప్ వ‌స్తుంది.
* ఒక‌వేళ పాప్ అప్ రాక‌పోతే ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోని లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి. అప్పుడు పాన్ కార్డులో ఉన్న‌ మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివ‌రాలు క‌నిపిస్తాయి. ఆధార్ కార్డులో ఉన్న వివ‌రాల‌తో ఆ వివ‌రాలు స‌రిపోయాయో లేదో చూసుకోవాలి. ఆ త‌ర్వాత ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి link now బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే స‌రిపోతుంది.
* అప్పుడు ఆధార్ విజ‌య‌వంతంగా అనుసంధాన‌మైంది అని ఒక పాప్ అప్ వ‌స్తుంది.
* https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ వెబ్‌సైట్ల ద్వారా కూడా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవ‌చ్చు.

SMS ద్వారా:
* రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 567678 లేదా 56161 నంబ‌ర్‌కు మెసేజ్ చేయ‌డం ద్వారా కూడా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవ‌చ్చు.
* ఇందుకోసం రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 12 అంకెల ఆధార్ నంబ‌ర్ త‌ర్వాత స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి ఎస్ఎంఎస్ చేయాలి.

లింక్ అవ్వ‌క‌పోతే..
* ఆధార్ కార్డు, పాన్ కార్డుల్లో పేరు, జెండ‌ర్‌, పుట్టిన తేదీ వంటి వివ‌రాలు వేర్వేరుగా ఉంటే ఆధార్‌తో పాన్ కార్డు లింక్ అవ్వ‌దు.
* అలాంట‌ప్పుడు ఆధార్ కార్డులో త‌ప్పుగా ఉన్న వివ‌రాల‌ను మార్చుకోవాలి.
* ఆ త‌ర్వాత ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోవాలి.
* ఆధార్‌లో వివ‌రాల‌ను యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మార్చుకోవ‌చ్చు.
* ఒక‌వేళ పాన్ కార్డులో వివ‌రాల‌ను మార్చుకోవాల‌ని అనుకుంటే https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ద్వారా మార్చుకోవ‌చ్చు.

ఇప్పటివరకూ ఆధార్, పాన్ లింక్ చేసుకోనివారు ఎలా లింక్ చేసుకోవాలో ఈ కింద ఇచ్చిన వీడియోని చూసి ఫాలో అవ్వండి.