Jio Smart Home Services : జియో స్మార్ట్ హోమ్ సర్వీసులపై ఆకాష్ అంబానీ ప్రకటన.. జియోభారత్ డిజిటల్ స్వాతంత్ర్యానికి గేట్‌వే!

Jio Smart Home Services : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో చైర్మన్ ఆకాష్ అంబానీ అనేక కీలక అంశాలపై ప్రసంగించారు. ప్రత్యేకించి జియో స్మార్ట్ హోమ్ సర్వీసులను ప్రవేశపెట్టడంపై ప్రకటించారు. జియోభారత్ డిజిటల్ స్వాతంత్ర్యానికి గేట్‌వే అని అన్నారు.

Jio Smart Home Services : జియో స్మార్ట్ హోమ్ సర్వీసులపై ఆకాష్ అంబానీ ప్రకటన.. జియోభారత్ డిజిటల్ స్వాతంత్ర్యానికి గేట్‌వే!

Reliance AGM 2023 Updates _ Akash Ambani introduces Jio Smart Home Services

Jio Smart Home Services – Akash Ambani : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ (Akash Ambani) అనేక అంశాలపై ప్రస్తావించారు. ప్రధానంగా జియో స్మార్ట్ హోమ్ సేవలను ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరి నివాసాలతో ఎలా పరస్పరం వ్యవహరించాలి అనే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భారత్‌లో డేటా వినియోగంలో 80శాతం పైగా ఇంట్లోనే జరుగుతాయని చెప్పారు. జియో స్మార్ట్ హోమ్ సర్వీసులను ప్రవేశపెట్టడం పట్ల చాలా థ్రిల్‌గా ఉన్నానని ఆయన చెప్పారు.

Read Also : Reliance AGM 2023 Event : రిలయన్స్ AGM 2023 ఈవెంట్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలపై ఆసక్తి.. లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

కంపెనీ పురోగతిపై ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ‘జియో ఫైబర్ సర్వీసులు ఇప్పటికే 10 మిలియన్లకు పైగా కస్టమర్లను కనెక్ట్ చేసింది. (Jio AirFiber) ఆగమనంతో ఆ పరిధిని 200 మిలియన్ల గృహాలు, వివిధ ప్రాంగణాలకు మరింతగా విస్తరిస్తుంది. కంటెంట్ వినియోగానికి జియో ప్రపంచ మార్పును సూచిస్తుంది. భారత్‌లో ఈ పరివర్తనను వేగవంతం చేయడంలో జియో పాత్ర చాలా కీలకం. సెట్-టాప్ బాక్స్ ప్రఖ్యాత అంతర్జాతీయ స్ట్రీమింగ్ అప్లికేషన్‌లతో పాటు JioCinema, JioTV+కి సపోర్టు ఇస్తుంది’ అని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు.

Reliance AGM 2023 Updates _ Akash Ambani introduces Jio Smart Home Services

Jio Smart Home Services : Reliance AGM 2023 Updates _ Akash Ambani introduces Jio Smart Home Services

జియోభారత్ డిజిటల్ స్వాతంత్ర్యానికి గేట్‌వే :
జియోభారత్ డిజిటల్ స్వాతంత్ర్యం సాధించడానికి ఒక మార్గంగా పనిచేస్తుందని ఆకాష్ అంబానీ తెలిపారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లకు యాక్సస్ లేని వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. 2G ఫీచర్ ఫోన్‌ల ధరతో పోల్చితే.. (JioBharat 4G) సామర్థ్యాలను అందిస్తుందని ఆయన తెలిపారు. #JioBharatలో UPI ఇంటిగ్రేటెడ్ సర్వీసులతో బ్యాలెన్స్ చెకింగ్, రియల్ టైమ్ నోటిఫికేషన్‌లతో పాటు ప్రభుత్వం నుంచి క్రమబద్ధీకరించిన లైవ్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.

నెలకు రూ. 123 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14GB డేటా లభిస్తుందని అంబానీ పేర్కొన్నారు. ఇతర ఆఫర్‌లతో పోలిస్తే.. 30 శాతం ఖర్చు తగ్గుతుందని కిరణ్ థామస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. 2G-రహిత భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయడానికి… కిరణ్ థామస్ అభివృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్, ప్లాట్‌ఫారమ్‌ను సారూప్య భాగస్వాములకు విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు. ఈ విస్తరణలో (Karbonn) వంటి అనేక బ్రాండ్‌లు ఉన్నాయి. అందులో JioBharat ఫోన్ల సృష్టికి దోహదపడుతున్నాయి.

Read Also : Reliance AGM 2023 Updates : జియో యూజర్లకు అంబానీ గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి జియో 5G ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు..!