Reliance AGM 2023 Event : రిలయన్స్ AGM 2023 ఈవెంట్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలపై ఆసక్తి.. లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Reliance AGM Event : రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ AGM లైవ్.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ AGM 2023 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. 5G రోల్ అవుట్ ప్రోగ్రెస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రిలయన్స్ రిటైల్ IPO ప్లాన్‌ల కోసం భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌తో సహా అనేక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

Reliance AGM 2023 Event : రిలయన్స్ AGM 2023 ఈవెంట్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలపై ఆసక్తి.. లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Reliance AGM event today at 2PM_ Jio 5G smartphone, 5G tariff plans and more expected

Reliance AGM Event : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలో సోమవారం (ఆగస్టు 28)న 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) నిర్వహిస్తోంది. RIL AGM మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. కంపెనీ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్, YouTube ఛానెల్‌లలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు అంబానీ కీలక ప్రకటనల తర్వాత Q&A సెషన్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ ఈవెంట్ సమ్మేళనం వ్యాపారం మాత్రమే కాకుండా సాంకేతిక-సంబంధిత అంశాల గురించి కూడా కీలక ప్రకటనలను చేసే అవకాశం ఉంది. రిలయన్స్ టెలికాం, రిటైల్ వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేస్తుందో తెలుసుకోవడానికి మార్కెట్ పరిశీలకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) విస్తరణ కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. 46వ వార్షిక జనరల్ మీటింగ్‌ (Post-IPO వీడియో కాన్ఫరెన్సింగ్/ఇతర ఆడియో విజువల్స్ ద్వారా స్ట్రీమింగ్ కానుందని అని (RIL) పబ్లిక్ నోటీసులో వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో RIL చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రధానంగా ప్రసగించనున్నారు. ఈ AGM ఈవెంట్ సందర్భంగా రిలయన్స్ జియో IPO, రిలయన్స్ రిటైల్ IPO, జియోఫోన్ 5G ఆవిష్కరణలకు సంబంధించి రిల్ కీలక ప్రకటనలు చేయనుంది. ప్రత్యేకించి ముఖేశ్ అంబానీ ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారు అనేదానిపై మరింత ఆసక్తి నెలకొంది.

Read Also :  Jio Bharat Phone Sale : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో జియో భారత్ ఫోన్ సేల్.. ఎప్పటినుంచంటే? గెట్ రెడీ..!

జియోఫోన్ 5G, 5G టారిఫ్ ప్లాన్లపై క్లారిటీ ఇస్తారా? :  

RIL AGM 2023 సంస్థ క్లీన్ ఎనర్జీ యూనిట్ రిలయన్స్ న్యూ ఎనర్జీలో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ కంపెనీ విస్తరణ ప్రణాళికలు, తదుపరి కొనుగోళ్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. RIL దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొత్త Jio 5G ప్లాన్‌లను ప్రకటించవచ్చు. JioPhone 5G 2023 రూ. 10వేల కన్నా తక్కువ ధరకు ఆవిష్కరించవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్, యూకే అంతటా 3 ప్రాపర్టీలను సంయుక్తంగా నిర్వహించడానికి ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ (ఒబెరాయ్)తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. కొత్త జియో ఫోన్‌తో పాటు, రిలయన్స్ జియో ప్రారంభ 5G టారిఫ్ ప్లాన్‌లను అందించే అవకాశం ఉంది.

Reliance AGM event today at 2PM_ Jio 5G smartphone, 5G tariff plans and more expected

Reliance AGM event today at 2PM_ Jio 5G smartphone, 5G tariff plans and more expected

ఇప్పటివరకు, ప్రస్తుతం ఉన్న 4G ప్లాన్‌ల ఫ్రేమ్‌వర్క్‌లో 5G సర్వీసులు అందించింది. గత ఏడాదిలో AGM సందర్భంగా, రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ Google భాగస్వామ్యంతో సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనే ఉద్దేశాన్ని ధృవీకరించారు. ఇప్పుడు, నేటి ఈవెంట్‌లో దీనికి సంబంధించి కీలక అంశాలను అంబానీ ప్రకటించే అవకాశం ఉంది. JioPhone 5G అల్ట్రా సరసమైనది.. మునుపటి రిలయన్స్ AGM ఈవెంట్‌లో రాబోయే ఈ ఫోన్ రూ. 8వేల నుంచి రూ. 10వేల మధ్య ఉండవచ్చని లీక్‌లు ఇప్పటివరకు సూచించినప్పటికీ, కచ్చితమైన ధర ఎంత అనేది ఇంకా వెల్లడి కాలేదు. ఇది నిజమని తేలితే, భారత మార్కెట్లో అత్యంత సరసమైన 5G ఫోన్ ఇదే అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 15వేల కింద ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ 5G ఆప్షన్లు ఉన్నాయి. మరి కొద్ది గంటల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.

రిలయన్స్ AGM ఈవెంట్‌ను ఎలా వీక్షించాలంటే? :
2023లో రిలయన్స్ ఇండస్ట్రీస్ AGM మధ్యాహ్నం 2గంటలకు గంటలకు లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ యాక్సెస్ చేయవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు చివరిసారిగా బోర్స్‌లలో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. గత ముగింపు రూ.2,469.95తో పోలిస్తే.. ఈ షేరు 0.04 శాతం నష్టపోయి రూ.2,469 వద్ద ట్రేడవుతోంది. రిల్ 46వ ఏజీఎం వీడియో కాన్ఫరెన్సింగ్ మోడ్‌లో నిర్వహిస్తోంది. వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర ఆడియో విజువల్ మెథడ్స్ ద్వారా ఏజీఎంలో జాయిన్ కావచ్చు. పెట్టుబడిదారులు https://jiomeet.jio.com/rilagm/ లింక్‌ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. RIL ఛైర్మన్ అండ్ MD ముఖేష్ అంబానీ ప్రసంగాన్ని జియో మీట్ లింక్ https://jiomeet.jio.com/rilagm/joinmeeting ద్వారా వీక్షించవచ్చు.

Read Also : Reliance AGM 2023 Event : ఆగస్ట్ 28న రిలయన్స్ AGM 2023 ఈవెంట్.. ముఖేష్ అంబానీ జియో 5G ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటిస్తారా?