Reliance Jio Telangana : తెలంగాణలో జియో ఫైర్ సేఫ్టీ క్యాంపెయిన్‌.. నెట్‌వర్క్ విశ్వసనీయత, కస్టమర్ సంతృప్తిపైనే దృష్టి!

Reliance Jio Telangana : తెలంగాణలో జియో ఫైర్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభమైంది. కస్టమర్ల సంతృప్తితో పాటు నెట్‌వర్క్ విశ్వసనీయతపైనే జియో దృష్టిపెట్టింది.

Reliance Jio Telangana : తెలంగాణలో జియో ఫైర్ సేఫ్టీ క్యాంపెయిన్‌.. నెట్‌వర్క్ విశ్వసనీయత, కస్టమర్ సంతృప్తిపైనే దృష్టి!

Reliance Jio launches fire safety and prevention campaign in Telangana

Updated On : September 14, 2023 / 9:37 PM IST

Reliance Jio Telangana : రిలయన్స్ జియో నెట్‌వర్క్ సైట్స్, సౌకర్యాల భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. ఇందులోభాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023ని ప్రారంభించింది. ఫైర్ ప్రివెన్షన్ – మస్ట్ ఫర్ నెట్‌వర్క్ అవైలబిలిటి అండ్ సర్వీస్‌తో కస్టమర్ అనే థీమ్‌ ద్వారా ఈ సమగ్ర క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. తెలంగాణలో జియో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ నిర్వహణ పాయింట్లు, జియో సెంటర్‌ ప్రాంతాలు, అన్ని నెట్‌వర్క్‌ సైట్‌లను కవర్ చేస్తూ నిర్వహిస్తోంది.

Read Also : Honor 90 5G : 200MP కెమెరా, భారీ డిస్‌ప్లేతో హానర్ 90 5G ఫోన్ ఇదిగో.. భారత్‌లో ధర ఎంత? ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

జియో ఉద్యోగులు, సర్వీస్ పార్టనర్ ఉద్యోగులు, ఇతర వాటాదారులలో అగ్ని ప్రమాదాలపై భద్రతపరంగా అవగాహన కల్పించడమే ఈ క్యాంపెయిన్ ప్రాథమిక లక్ష్యం. జియో ఉద్యోగుల నైపుణ్యాలు, పరిజ్ఞానం, అవగాహన పెంచడం ద్వారా అగ్ని ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. ‘జీరో ఫైర్ ఇన్సిడెంట్ ఎట్ సైట్’ జియో ప్రయత్నిస్తోంది.

Reliance Jio launches fire safety and prevention campaign in Telangana

Reliance Jio Telangana launches fire safety and prevention campaign in Telangana

జియో ఉద్యోగులు, సేవా భాగస్వాముల శ్రేయస్సు, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతరాయం లేని సర్వీసులకు అగ్నిమాపక భద్రత చాలా ముఖ్యమైనదని జియో తెలంగాణ భావిస్తోంది. ఫైర్-సంబంధిత సంఘటనలను నివారించడంలో ఫీల్డ్ టీమ్‌లలో ఫైర్ సేఫ్టీ అవగాహన చాలా కీలకమని కంపెనీ చెబుతోంది.

ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఫైర్ ప్రివెన్షన్, సేఫ్టీ ప్రోటోకాల్స్‌పై సమగ్ర శిక్షణా సెషన్‌లు, ఫైర్ సేఫ్టీ ఎక్సరసైజులు, సమాచారం వనరుల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షణీయమైన వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహిస్తోంది.
అగ్ని మాపక భద్రత, నివారణ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా జియో తెలంగాణ నెట్వర్క్ సైట్ల సౌకర్యాలను కాపాడటం, నెట్‌వర్క్ విశ్వసనీయతకు అంతిమంగా వినియోగదారులకు మెరుగైన సర్వీసులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : iPhone 14 Series Price Cut : ఐఫోన్ 15 సిరీస్ రాగానే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?