Jio Prepaid Plans : రిలయన్స్ జియో ప్రీపెయిడ్ 5G టారిఫ్ ప్లాన్ల ధరలు పెంచనుందా? కంపెనీ క్లారిటీ ఇదిగో..!
Jio Prepaid Plans : దేశీయ టెలికం కంపెనీలైన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా 5G టారిఫ్ ప్లాన్ల ధరలను పెంచాలని యోచిస్తున్నప్పటికీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్ల ధరను పెంచేది లేదని స్పష్టం చేసింది.

Reliance Jio prepaid plans to cost more, what the company says
Jio Prepaid Plans : 5G ప్లాన్లు మరింత ఖరీదైనవి కానున్నాయా? రిలయన్స్ జియో విషయంలోనే కాదు. ఇతర టెలికాం కంపెనీలు వోడాఫోన్ ఐడియా (Vodafone idea), ఎయిర్టెల్ (Airtel) ధరలు పెంచాలని యోచిస్తున్నప్పటికీ.. జియో 5G ప్లాన్ల (Jio 5G Tarrif Plans) టారిఫ్‌లను పెంచబోమని ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని కంపెనీ స్పష్టం చేసింది.
నివేదిక ప్రకారం.. 5G సర్వీసులను ప్రవేశపెట్టినప్పటికీ, పోటీ ధరలను కొనసాగించాలనే ఉద్దేశాన్ని జియో ప్రకటించింది. ఇంకా 2G నెట్‌వర్క్‌లలో ఉన్న Airtel, Vodafone Idea, BSNL/MTNL నుంచి 240 మిలియన్ల కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను జియో కలిగి ఉంది. తద్వారా ఎక్కువ సంఖ్యలో యూజర్లకు సరసమైన ధరకే అందించడమే కంపెనీ ప్రాథమిక లక్ష్యం. సరళంగా చెప్పాలంటే.. రిలయన్స్ జియో రేట్లను గణనీయంగా పెంచదు.
భారతీయులందరికి డేటా యాక్సస్ అందిస్తాం :
డేటా-ఇంటెన్సివ్ ఇంటర్నెట్ ప్లాన్లకు మారినప్పుడు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడంపై కంపెనీ దృష్టి పెడుతోంది. 200 మిలియన్లకు పైగా మొబైల్ యూజర్లకు ఇప్పటికీ 2Gతో సరైన అనుభవం లేదు. డిజిటల్ సాధికారత కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉంది. 2G-mukt (టెలికాం) పరిశ్రమను అభివృద్ధి చెందడానికి ఏకైక మార్గం సరసమైన యాక్సెసిబిలిటీని అందించడమేనని జియో మాథ్యూ ప్రెసిడెంట్ ఉమెన్ అన్నారు.

Jio Prepaid Plans
భారతీయులందరికీ డేటా యాక్సెస్ ఉండేలా చేయనున్నట్టు తెలిపారు. భారతీయులందరికీ అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించనున్నాం. రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లో ధరలకు పోటీగా అధిక ధరల పెంపు లేకుండా ఎక్కువ మంది తమ సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు.
వోడాఫోన్, ఎయిర్టెల్ బాదుడే.. బాదుడు :
గత మూడు త్రైమాసికాల్లో రిలయన్స్ జియో ప్రతి యూజర్ నుంచి సగటున సుమారు రూ. 181.7 సంపాదించింది. గత ఏడాదితో పోలిస్తే.. ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. వినియోగదారునికి సగటు ఆదాయం (ARPU) టెలికాం కంపెనీలకు రిపోర్ట్ కార్డ్ లాంటిది. ప్రతి కస్టమర్ నుంచి ఎంత డబ్బు సంపాదిస్తున్నారో సూచిస్తుంది. మరోవైపు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు తమ వినియోగదారుల నుంచి ప్రీపెయిడ్ ప్లాన్లపై భారీగా ధరలను పెంచుతున్నాయి.
ఎందుకంటే.. టెలికాం పరిశ్రమకు తమ 5G నెట్‌వర్క్‌లను విస్తరించడంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు అవసరమని అంటున్నాయి. టెలికాం పరిశ్రమ పటిష్టంగా ఉండాలంటే.. ARPU రూ.300కి చేరుకోవాలని కోరుకుంటున్నామని ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. ఎయిర్టెల్ ప్రస్తుతం ఒక్కో యూజర్‌కు రూ. 200 ఛార్జ్ చేస్తుండగా.. జియో కన్నా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, వోడాఫోన్ ఐడియా ప్రతి యూజర్ నుంచి దాదాపు రూ. 142 మాత్రమే ఛార్జ్ చేస్తోంది. దీంతో పోటీదారుల కన్నా వెనుకబడిపోతోంది.
Read Also : Jio Prima 4G Phone : అత్యంత సరసమైన ధరకే జియో ప్రైమా 4G ఫోన్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు మీకోసం..!