Rs 2000 denomination: రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నాం: ఆర్బీఐ సంచలన ప్రకటన
వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Reserve Bank of India
RBI: భారతీయ రిజర్వు బ్యాంకు సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నామని (Rs 2000 denomination banknotes) చెప్పింది. వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
అలాగే, సెప్టెంబరు 30 వరకు మాత్రమే రూ.2 వేల నోటు చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ (Reserve Bank of India) పేర్కొంది. అంటే రూ.2 వేల నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో ఆ తేదీలోపు మార్చుకోవచ్చు. ఈ నెల 23 నుంచి బ్యాంకుల్లో వినియోగదారులు రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. 2018-2019 ఆర్థిక ఏడాదిలోనే ఆర్బీఐ రూ.2 వేల నోట్ల ముద్రణను ఆపేసింది.
క్లీన్ నోట్ పాలసీ
ఒక విడతలో రూ.20,000 నోట్లను మార్చుకునే అవకాశం మాత్రమే ఆర్బీఐ కల్పించింది. రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ నోట్లు చలామణీలో చాలా వరకు తగ్గాయి. రూ.2 వేల నోట్లను 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఈ రూ.2 వేల నోట్లు చలామణీలో ఉన్నాయి. రూ.1000 నోట్లను రద్దు చేసి అంతకన్నా పెద్ద నోట్లను తీసుకొచ్చినందుకు కేంద్ర సర్కారుపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు “క్లీన్ నోట్ పాలసీ” కింద ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ఇవాళ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఏ బ్యాంకులోనైనా సరే నోట్లను మార్చుకోవచ్చు. బ్యాంకు అకౌంట్లలో రూ.2 వేల నోట్లను జమ చేసుకోవచ్చు.
బ్యాంకులో జరిగే రోజూవారీ కార్యకలాపాలకు ఇబ్బందులు కలగకుండా నోట్ల మార్పిడి జరగాలని ఆర్బీఐ సూచనలు చేసింది. ముద్రించిన అన్ని రూ.2 వేల నోట్లలో ప్రస్తుతం 10.8 శాతం మాత్రమే చలామణీలో ఉన్నాయని ఆర్బీఐ కూడా చెప్పింది. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023

Reserve Bank of India

Reserve Bank of India

Reserve Bank of India