Royal Enfield Bullet : రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల జోరు.. ఫిబ్రవరిలో పెరిగిన 21శాతం వృద్ధి..!
Royal Enfield Bullet : ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఫిబ్రవరి 2023లో అమ్మకాల జోరును కొనసాగించింది. కంపెనీ మొత్తం వృద్ధిలో సంవత్సరానికి (yoy) 21శాతం వృద్ధిని నమోదు చేసి 71,544 యూనిట్లకు చేరుకుంది.

Royal Enfield Bullet, Classic, Hunter, Meteor, others _ Company's total volumes rise 21 Percentage in Februa
Royal Enfield Bullet : ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఫిబ్రవరి 2023లో అమ్మకాల జోరును కొనసాగించింది. కంపెనీ మొత్తం వృద్ధిలో సంవత్సరానికి (yoy) 21శాతం వృద్ధిని నమోదు చేసి 71,544 యూనిట్లకు చేరుకుంది. ఫిబ్రవరి 2022లో కంపెనీ 59,160 యూనిట్లను విక్రయించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రస్తుతం హంటర్ 350 (Hunter), బుల్లెట్ 350 (Bullet 350), క్లాసిక్ 350 (Classic 350), మీటియర్ 350 (Meteor 350), హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, సూపర్ మెటోర్ 650 వంటి మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది.
దేశీయ విపణిలో కంపెనీ హోల్‌సేల్‌లు ఫిబ్రవరి 2023లో 24శాతం వృద్ధితో 64,436 యూనిట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది నెలలో 52,135 యూనిట్లు ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఎగుమతులు 7,025 యూనిట్ల నుంచి 2023 ఫిబ్రవరిలో 1 శాతం పెరిగి 7,108 యూనిట్లకు పెరిగాయి.

Royal Enfield Bullet, Classic, Hunter, Meteor, others
దేశీయ మార్కెట్‌లో మొత్తం పనితీరు ప్రోత్సాహకరంగా కొనసాగుతోంది. ఇటీవలి మోటార్‌సైకిళ్లలో స్టైల్, పర్పార్మెన్స్‌తో కూడిన మోటార్‌సైకిళ్లను అందించాలనే లక్ష్యమని రాయల్ ఎన్‌ఫీల్డ్ CEO బి. గోవిందరాజన్ అన్నారు. ఆగస్టు 2022లో లాంచ్ అయినప్పటి నుంచి కేవలం ఆరు నెలల్లోనే హంటర్ 350 యువ భారతీయులలో ఆదరణ పొందింది. రోడ్లపై లక్షకు పైగా మోటార్‌సైకిళ్లను కలిగి ఉందని అన్నారాయన.
హంటర్ 350 ధర రూ. 1,49,900, రూ. 1,71,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ). రోడ్‌స్టర్ 349cc ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. 20.2bhp, 27Nmని ఉత్పత్తి చేస్తుంది. హంటర్ 350 మైలేజ్ లీటరుకు 36.5 కి.మీ ఇస్తుండగా.. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవలే సూపర్ మీటోర్ 650ని లాంచ్ చేసింది. ఈ బుల్లెట్ ధర రూ. 3,48,900 నుంచి రూ. 3,78,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మధ్య ఉంటుంది. ఈ క్రూయిజర్ 648cc సమాంతర రెండు ఇంజిన్లను కలిగి ఉంది. 46.4bhp, 52.3Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సూపర్ మెటోర్ లీటరుకు 22 కి.మీ 650 మైలేజ్ ఇస్తుంది.