Royal Enfield Super Meteor 650: భారత్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఖ‌రీదైన బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర‌, బైక్ ప్ర‌త్యేక‌లు ఇవే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ మార్కెట్లలో వరుసగా లగ్జరీ బైక్స్‌ను విడుదల చేస్తోంది. పాత లైనప్ ను రీఫ్రెష్ చేసి కొత్త వేరియంట్లను కూడా ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మోటార్ 650 భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Royal Enfield Super Meteor 650: భారత్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఖ‌రీదైన బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర‌, బైక్ ప్ర‌త్యేక‌లు ఇవే..

Royal Enfield Super Meteor 650

Royal Enfield Super Meteor 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ మార్కెట్లలో వరుసగా లగ్జరీ బైక్స్‌ను విడుదల చేస్తోంది. పాత లైనప్ ను రీఫ్రెష్ చేసి కొత్త వేరియంట్లను కూడా ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియార్‌ 650 భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు వేరియంట్ల‌లో ఆస్ట్రల్, ఇంటర్‌స్టెల్లార్, సెలెస్టియల్ మోడ‌ల్‌నే రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సూప‌ర్ మీటియార్ 650 టూర‌ర్ అని పిలుస్తారు. ఇందుకు సంబంధించిన బైక్ ధ‌ర‌ను కంపెనీ ప్ర‌క‌టించింది. మూడు వేరియంట్ల‌లో ఎక్స్ షోరూమ్ ధ‌ర‌లు చూస్తే.. ఆస్ట్రాల్ రూ. 3.48 లక్షలుకాగా, ఇంటర్ స్టెల్లార్ ధర రూ. 3,63,900, సెలెస్టియల్ ధర రూ. 3,78,900లుగా ఉంది. ఇవి పలు రంగుల్లో అందుబాటులోకి వ‌చ్చాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియార్ 650 ఆస్ట్రల్ ( బ్లాక్, బ్లూ, గ్రీన్‌), ఇంటర్ స్టెల్లార్ కలర్ స్కీంలలో ( గ్రే, గ్రీన్), సెలెస్టియల్ (రెడ్, బ్లూ) క‌ల‌ర్స్‌లో మార్కెట్‌లో అందుబాటులోకి వ‌చ్చాయి.

 

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియ‌ర్ 650 బైక్ లో ఉన్న ఇంజిన్ ఇత‌ర మోడ‌ల్స్‌లో ఉన్న‌ట్లుగానే ఉంటుంది. ఇంటర్‌సెప్టెర్ 650, కాంటినెంటల్ జీటీ650 వేరియంట్ల‌లో ఉన్న‌ 648సీసీ ట్విన్ ఇంజిన్ లేటెస్ట్ బైక్‌లో కూడా ఉంటుంది. ఇది 47పీహెచ్‌పీ పవర్ ను, 52.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ న్యూ బైక్స్‌లో సైడ్ ప్యానెల్‌లో, హెడ్ భాగంలో చిన్న‌పాటి మార్పులు జ‌రిగాయి. బైక్ బ‌రువు 241 కిలోలు ఉంటుంది. ఈ బైక్ వీల్ బేస్ 1500 ఎంఎం, పొడవు 2260 ఎంఎం, వెడల్పు 890ఎంఎం (without mirrors) , ఎత్తు 1155 ఎంఎం ఉంటుంది. ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో పాటు ఆరు స్పీడ్ ట్రాన్స్ మిషన్‌తో జత చేయబడింది.

 

ఎన్‌ఫీల్డ్ కంపెనీ సూపర్ మెటార్ 650 మూడు వేరియంట్ల‌లో అందుబాటులోకి తెచ్చింది. వీటిలో సోలో టూరర్ జెన్యూన్ మోటార్ సైకిల్ యాక్సెసరీస్ కిట్‌తో రానున్న ‘ఆస్ట్రల్ బ్లాక్ సూపర్ మెటార్ 650’ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ బైక్ ప్యూయెల్‌ ట్యాంకు సామర్థ్యం 15.7 లీటర్లు కలిగి ఉంది. బైక్ గ్రౌండ్ క్లియ‌రెన్స్ 135 మిల్లీ మీట‌ర్లు కాగా, సీటు ఎత్తు 740 మిల్లీ మీట‌ర్లు. ఈ నూత‌న బైక్‌కు 19-అంగుళాల (ముందు), 16-అంగుళాల (వెనుక) ట్యూబ్‌లెస్ టైర్లు అమ‌ర్చ‌డం జ‌రిగింది. ముందు, వెనుక భాగాల్లో ఒక్కొక్క డిస్క్ బ్రేక్ ఉంది. నిటారుగా రైడింగ్ పొజిష‌న్ తో కూడిన అద్భుత‌మైన రెట్రో క్రూయిజ‌ర్ డిజైన్‌ను క‌లిగి ఉండ‌టం విశేషం.