Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 సిరీస్ 5G ఫోన్.. జూలై 14న లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో జూలై 14న అధికారికంగా లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ M 13 సిరీస్ రెండు వేరియంట్లలో రానుంది.

Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 సిరీస్ 5G ఫోన్.. జూలై 14న లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung Galaxy M13, Galaxy M13 5g India Launch On July 14 Expected Price, Specifications

Samsung Galaxy M13 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో జూలై 14న అధికారికంగా లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ M 13 సిరీస్ రెండు వేరియంట్లలో రానుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ద్వారా భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అమెజాన్ ఇండియాలో Galaxy M13, Galaxy M13 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లకు సంబంధించిన వివరాలతో లిస్టు అయింది. శాంసంగ్ రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌ను కూడా వెల్లడించింది. Samsung Galaxy M13 5G, Galaxy M13 ధర వంటి వివరాలను జూలై 14న శాంసంగ్ అధికారికంగా ప్రకటించనుంది. అధికారిక లాంచ్ ఈవెంట్‌కు ముందు.. Samsung Galaxy M13, Galaxy M13 5G ఫోన్ ఫీచర్లు, ధర వంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Galaxy M13 5G స్పెసిఫికేషన్‌లు ఇవే :
శాంసంగ్ Galaxy M13 5G రెండు గెలాక్సీ M13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో రానుంది. ఇదో ఖరీదైన మోడల్. 11 5G బ్యాండ్‌లతో రానుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. హుడ్ కింద 5000 mAh బ్యాటరీని కూడా అందిస్తోంది. లీకైన డేటా ప్రకారం.. Galaxy M13 5G డైమెన్సిటీ 700 SoCని కలిగి ఉంటుంది. 12GB వరకు RAMని పెంచుకోవచ్చు. ఫిజికల్, వర్చువల్ RAM మిశ్రమంగా ఉండనుంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ అవుతుంది. బేస్ మోడల్‌లో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6GB+128GB స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంటుంది. Samsung నుంచి బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉండనుంది. 5MP ఫ్రంట్ కెమెరాతో రానుంది. ఫ్రంట్ సైడ్.. HD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల IPS LCD ఉంటుంది. Samsung Galaxy M13 5G భారత మార్కెట్లో ధర రూ. 15వేల నుంచి రూ. 20వేల మధ్య ఉండనుంది.

Samsung Galaxy M13, Galaxy M13 5g India Launch On July 14

Samsung Galaxy M13, Galaxy M13 5g India Launch On July 14

స్పెసిఫికేషన్‌లు, అంచనా, ధర ఎంతంటే :
శాంసంగ్ Galaxy M13 రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. నివేదికల ప్రకారం.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల  కోసం.. Galaxy M13 4G 8MP ఫ్రంట్ కెమెరాతో రానుంది. హుడ్ కింద.. ఈ ఫోన్ Exynos 850 SoCతో రానుంది. 5G వేరియంట్ మాదిరిగానే.. 4G మోడల్ కూడా 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. బేస్ మోడల్ నుంచి 128GB ఇంటర్నల్ స్టోరేజీతో 6GB RAM వేరియంట్‌ను అందిస్తుంది. Galaxy M13 4G 6000 mAh బ్యాటరీతో రానుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. బాక్స్‌లో ఛార్జర్‌ను ఉంటుందో Samsung వెల్లడించలేదు. Galaxy M13 4G ఫోన్ 6.6-అంగుళాల IPS LCDతో రానుంది. Full HD+ రిజల్యూషన్, ఫ్రంట్ కెమెరా, ఎగువన వాటర్-డ్రాప్ నాచ్‌ ఉండనుంది. Galaxy M13 4G ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. పైన OneUI 4.1 లేయర్ ఉంది. ఆఫర్‌ ప్రకార.. Samsung Galaxy M13 ఇండియా ధర బేస్ మోడల్‌కు రూ. 15వేల లోపు ఉంటుందని అంచనా.

Read Also : Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?