Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే?

Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే?

Samsung Galaxy M14 available at very low price on official India site

Samsung Galaxy M14 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి గెలాక్సీ 5G ఫోన్ భారత మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ M14 5G చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ చాలా ప్రాంతాలలో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ M14 5Gని కొనుగోలుపై తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ డిస్కౌంట్ డీల్ :
శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో లాంచ్ ధర వద్ద అందుబాటులో ఉంది. 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ (Samsung.com)లో అసలు ధర రూ. 13,990 వద్ద అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ 5G ఫోన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్నాయి. శాంసంగ్ ఇండియా (Samsung India) అధికారిక వెబ్‌సైట్‌లో, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,500 తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 12,490కి తగ్గుతుంది.

Read Also : Samsung Galaxy A14 : 50MP ట్రిపుల్ కెమెరాలతో శాంసంగ్ గెలాక్సీ A14 వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

శాంసంగ్ గెలాక్సీ M14 5G ఎందుకు కొనాలంటే? :
శాంసంగ్ గెలాక్సీ M14 బ్యాక్ కెమెరా ధర చాలా బాగుంది. భారత మార్కెట్లో రూ. 20వేల లోపు కొన్ని ఫోన్‌లలో అద్భుతమైన షాట్‌లను అందిస్తుంది. ఇందులో తక్కువ కాంతి ఫొటోగ్రఫీ యూజర్లను ఆకట్టుకుంది, మొత్తం మీద, భారత మార్కెట్లో రూ. 15వేల కన్నా తక్కువ ధరకే అద్భుతమైన కెమెరా సెటప్‌ను పొందవచ్చు. మంచి బ్యాటరీ లైఫ్ అందించే బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నారా?

Samsung Galaxy M14 available at very low price on official India site

Samsung Galaxy M14 5G available at very low price on official India site

శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫోన్ హుడ్ కింద భారీ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ 5G ఫోన్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 2 రోజుల వరకు వస్తుంది. ఎక్సినోస్ 1330 చిప్‌సెట్ కూడా ఉంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పెద్ద 6.6-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది.

గెలాక్సీ M14 5G ఎందుకు కొనరాదంటే? :
ఈ 5g ఫోన్ ధర తక్కువగా ఉన్నప్పటికీ.. స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. శాంసంగ్ కొంతకాలం క్రితం ప్రీమియం ఫోన్‌లతో అడాప్టర్‌లను నిలిపివేసింది. ఇప్పుడు బడ్జెట్ డివైజ్‌లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఛార్జర్ కోసం అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయినా పర్వాలేదు అనుకుంటే.. శాంసంగ్ గెలాక్సీ M14 5Gని కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్టును అందించింది. మీ ఇంట్లో పాత ఛార్జర్‌ ఉంటే, బ్యాటరీని టాప్ అప్ చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy F54 : శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..!