Stock investors : స్టాక్ మార్కెట్ లను ముంచెత్తిన కరోనా, 30 నిమిషాలు..5 లక్షల 27 వేల కోట్ల సంపద ఆవిరి

స్టాక్‌మార్కెట్లను కరోనా మరోసారి ముంచేసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను సెకన్లలోనే ఆవిరి చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాల్లో మొదలవుతున్న ఆంక్షలు, లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం మార్కెట్లను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది.

Stock investors : స్టాక్ మార్కెట్ లను ముంచెత్తిన కరోనా, 30 నిమిషాలు..5 లక్షల 27 వేల కోట్ల సంపద ఆవిరి

Stock Market

Share Market : స్టాక్‌మార్కెట్లను కరోనా మరోసారి ముంచేసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను సెకన్లలోనే ఆవిరి చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాల్లో మొదలవుతున్న ఆంక్షలు, లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం మార్కెట్లను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 11వందలు, నిఫ్టీ 350 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

మార్కెట్ ఆరంభంలోనే భారీ నష్టాలతో ప్రారంభమైంది. మార్కెట్లు మరింత కుప్పకూలతాయన్న భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఓ దశలో సెన్సెక్స్ 14వందల పాయింట్లు కోల్పోయింది. ఆరంభంలో కేవలం 30 నిమిషాల వ్యవధిలో 5 లక్షల 27 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది..

గత కొన్ని వారాలుగా మార్కెట్లకు మాములుగానే మండే కలిసి రావడం లేదు. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ, లాక్‌డౌన్ , నైట్ కర్ఫ్యూలు స్టాక్‌ మార్కెట్లను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలు నమోదు చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్లు, పడకలు, వ్యాక్సిన్ల కొరత, పెరుగుతున్న కరోనా మరణాలు వంటి వార్తలు ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్లను కోలుకోకుండా చేస్తున్నాయి.

Read More : Telangana High Court : కరోనా నియంత్రణపై చర్యలేవి..బార్లు, పబ్బుల్లో రద్దీని నియంత్రించారా ? హైకోర్టు ప్రశ్నలు