Stock Market : బ్లాక్ మండే, 19 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

ప్రపంచవ్యాప్తంగా ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంతో మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తంగా 19 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద...

Stock Market : బ్లాక్ మండే, 19 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

Stock Market

Stock Market Updates : భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. 1,545 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేసింది సెన్సెక్స్. 468 పాయింట్లు నిఫ్టీ కోల్పోయింది. ఐదు రోజుల్లోనే 3,816 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో భారతీయ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంతో మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తంగా 19 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

Read More : Hyderabad Rci : హైద్రాబాద్ ఆర్ సీ ఐలో అప్రెంటిస్ ల భర్తీ

ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపించాయి. మార్కెట్లు బ్లాక్ మండేను నమోదు చేశాయి. ఒమిక్రాన్ విస్తృతి కారణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందనే భయాలు…మార్కెట్లను కుప్పకూల్చాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపించడం, దానివల్ల ఇక్కడి స్టాక్ మార్కెట్‌లో అమెరికా ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులు కొంతమేరైనా వెనక్కి వెనక్కివెళ్లే అవకాశాలు ఉండటంతో మార్కెట్‌ సెంటిమెంట్ దెబ్బతిన్నది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మార్కెట్లను కోలుకోనివ్వడం లేదు. కీలకమైన అన్ని ప్రపంచదేశాల మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. గతవారం అమెరికా నాస్ డాక్ తీవ్ర నష్టాలతో ముగిసింది. రేపటి నుంచి అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో తీసుకునే నిర్ణయాలు మార్కెట్ల గతిని నిర్దేశించనున్నాయి.

Read More : Telangana BJP : రాజన్న పవర్ ఫుల్ దేవుడు, హామీలు నెరవేర్చకపోతే.. వాళ్ల సంగతి చూసుకుంటాడు

వడ్డీరేట్ల పెంపు తప్పదని ఇప్పటికే ఫెడ్ స్పష్టంగా చెప్పినా ఎంత వేగంగా దాన్ని అమలు చేయనుందనే విషయం కీలకం కానుంది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2వేల 271 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా దాదాపు 7వందల పాయింట్లు నష్టపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మారుతి, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, ICICI షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బడ్జెట్ వరకూ ఇదే ఒడిదుడుకులు ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడ్జెట్ తర్వాత మార్కెట్లు కొంత స్థిరపడొచ్చని చెబుతున్నారు.