Tamannaah Bhatia: ‘ష్యూర్ రెస్ట్’ మ్యాట్రెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పై కంపెనీ దృష్టి

ఏపీ, తెలంగాణల్లో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు తమన్నాను అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ‘ష్యూర్ రెస్ట్’ కంపెనీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో తమ మార్కెట్ మరింత వేగంగా విస్తరించుకునేందుకు తమన్నాతో భాగస్వామ్యం ఉపయోగపడుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ అన్నారు.

Tamannaah Bhatia: ‘ష్యూర్ రెస్ట్’ మ్యాట్రెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పై కంపెనీ దృష్టి

Tamannaah Bhatia: ప్రముఖ మ్యాట్రెస్ బ్రాండ్ ‘ష్యూర్ రెస్ట్’ అంబాసిడర్‌గా కనిపించబోతుంది నటి తమన్నా భాటియా. ఏపీ, తెలంగాణల్లో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు తమన్నాను అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ‘ష్యూర్ రెస్ట్’ కంపెనీ తెలిపింది.

Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి

తెలుగు రాష్ట్రాల్లో తమ మార్కెట్ మరింత వేగంగా విస్తరించుకునేందుకు తమన్నాతో భాగస్వామ్యం ఉపయోగపడుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ అన్నారు. తమన్నాను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సందర్భంగా ఉత్తమ్ మలానీ మీడియాతో మాట్లాడారు. ‘‘తమన్నాకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులున్నారు. ఎందరో అభిమానులకు ఐకాన్ ఆమె. అలాంటి తమన్నా ఇమేజ్.. మా ష్యూర్ రెస్ట్ బ్రాండ్ మరింత వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మేం తెలంగాణ, ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లపై దృష్టి సారించాం’’ అని ఉత్తమ్ మలానీ అన్నారు.

TDP Pattabhi Ram: గన్నవరం కోర్టుకు టీడీపీ నేత పట్టాభి.. కోర్టుకు తరలిస్తుండగా టీడీపీ నేతల ఆందోళన, ఉద్రిక్తత

అనంతరం హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడారు. ‘‘ష్యూర్ రెస్ట్ బ్రాండ్‌కు మంచి ఇమేజ్ ఉంది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీతో, అనేక వెరైటీలను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ కంపెనీ మ్యాట్రెస్‌లు మరింత ఉత్తమమైనవి. ఈ కంపెనీ మ్యాట్రెస్‌కు అంబాసిడర్‌గా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. మంచి పరుపు ఉంటేనే నిద్ర వస్తుంది.. నిద్రతోనే ఆరోగ్యం’’ అని తమన్నా వ్యాఖ్యానించారు. ష్యూర్ రెస్ట్ కంపెనీకి తెలంగాణ, ఏపీలో 1000కిపైగా డీలర్‌షిప్‌లు ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.