Altroz iCNG: టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ iCNG లాంచ్‌తో CNG మార్కెట్‌లో సంచలనం

Altroz iCNG వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్‌ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz iCNG అనేది వ్యక్తిగత విభాగంలో మూడవ CNG ఉత్పాదనగా ఉంది

Altroz iCNG: టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ iCNG లాంచ్‌తో CNG మార్కెట్‌లో సంచలనం

Tata Motors: భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, భారత దేశ పు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ CNG సాంకేతికతతో కూడిన Altroz iCNGని రూ. 7.55 లక్షల (ఆల్-ఇండియా, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈరోజు మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ పరిశ్రమ-మొదటి CNG సాంకేతికతను అభివృద్ధి చేసింది. AltroziCNG, ఇది బూట్ స్పేస్‌లో ఎటువంటి రాజీపడదు. కస్టమర్‌లు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అన్ని సౌకర్యాలు, విలాసాన్ని ఆస్వాదించేలా అందించేలా అత్యుత్తమ ఫీచర్లతో వస్తుంది.

iQOO Z7s 5G Launch : రూ. 20వేల లోపు ధరలో ఐక్యూ Z7s 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Altroz iCNG వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్‌ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz iCNG అనేది వ్యక్తిగత విభాగంలో మూడవ CNG ఉత్పాదనగా ఉంది. కార్ల యువ కొనుగోలుదారులకు CNG ని చక్కని ప్రతిపాదనగా చేస్తూ, Altroz iCNG ప్రత్యేక లక్షణాలను ప్రచారం చేయడానికి కంపెనీ OMG! its CNG ని విడుదల చేసింది.

Honda Car Offers : హోండా సిటీ, అమేజ్ కార్లపై అదిరే ఆఫర్లు.. మరెన్నో డిస్కౌంట్లు.. ఇదే బెస్ట్ టైం.. డోంట్ మిస్..!

ఈ ఆవిష్కరణ సందర్భంగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ ‘‘వినియోగదారులు ఆర్థిక పర్యావరణ అను కూల ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇంధనంగా సీఎన్జీ దాని విస్తృత లభ్యతతో ఎంతగానో ప్రజామోదం పొందింది. జనవరి 2022లో, మేం Tiago, Tigor లలో అధునాతన iCNG సాంకేతికతను ప్రారంభించడం ద్వారా మొదటి రాజీని పరిష్కరించాం, అత్యుత్తమ పనితీరు, అత్యుత్తమ ఫీచర్లను అందజేస్తున్నాం. ఈరోజు, సీఎన్జీ మార్కెట్‌ను పునర్నిర్వచించే విధంగా, బూట్ స్పేస్‌పై ఉన్న ప్రధాన ఆందోళనను పరిష్కరించడం ద్వారా పరిశ్రమలో మొదటి ఆఫర్ అయిన Altroz iCNGని ప్రారంభించడం పట్ల మేం సంతోషిస్తున్నాం’’ అని అన్నారు.