Threads War : మెటా ‘థ్రెడ్’ మార్క్‌పై మస్క్ మామకు కోపమొచ్చింది.. మేం తొలగించిన వాళ్లను అందుకే పెట్టుకున్నారు.. తగ్గేదే లే.. దావా వేసి తీరుతాం..!
Threads War : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్ (Threads App) రిలీజ్ చేసి కేవలం 24 గంటలు మాత్రమే అయింది. అంతలోనే 80 మిలియన్లకు పైగా వినియోగదారుల మైలురాయిని చేరుకుంది. ఈ క్రమంలో మెటా, ట్విట్టర్ల మధ్య పోటీ మరింత వేడెక్కుతోంది.

Threads War _ First he fired Twitter engineers, now Elon Musk is planning to sue company that allegedly hired them
Threads War : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ట్విట్టర్ (Twitter) , మెటా థ్రెడ్ (Meta Threads) యాప్ మధ్య గట్టి వార్ నడుస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)పై మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) కోపంతో రగిలిపోతున్నాడు. ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్ యాప్ రిలీజ్ చేయడంతో మస్క్ మామకు కోపమొచ్చింది. ట్విట్టర్‌కు ప్రత్యర్థిగా మెటా థ్రెడ్ కాపీక్యాట్ ఎలా చేస్తావంటూ మార్క్ జుకర్‌బర్గ్‌ను మస్క్ ఏకిపారేస్తున్నాడు. దాంతో ఇరువురి మధ్య వైరం మరింత తీవ్రమైంది. థ్రెడ్స్ యాప్ రిలీజ్ అయి కేవలం 24 గంటలు మాత్రమే అయింది.
అయితే, టెక్ పరిశ్రమలో ఈ రెండు ప్లాట్ఫారంల మధ్య పోటీ మరింత వేడెక్కుతోంది. ట్విట్టర్ నుంచి తొలగించిన అదే ఇంజనీర్ ఉద్యోగులను థ్రెడ్ యాప్ రూపొందించడం కోసం నియమించుకున్నందుకు మస్క్ ఇప్పుడు జుకర్‌బర్గ్‌పై కోపంగా ఉన్నాడు. ఇప్పుడు, మెటాపై దావా వేయడానికి మస్క్ సన్నద్ధమవుతున్నాడు.
థ్రెడ్స్ కాపీక్యాట్ యాప్ అంటూ ఆరోపణ :
ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత తొలగించిన మాజీ కంపెనీ ఉద్యోగులను ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫారమ్ నియమించుకుందని ఎలన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పిరో ఆరోపించారు. మెటా తన థ్రెడ్స్ అనే టెక్స్ట్ ఆధారిత యాప్‌ను ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు అలెక్స్ స్పిరో లేఖను పంపారు.
. @semafor exclusive: Elon’s lawyer Alex Spiro sent a letter to Mark Zuckerberg threatening legal action, claiming that Meta hired former Twitter employees to create a clone https://t.co/Kqq1bwWgGw
— Max Tani (@maxwelltani) July 6, 2023
మెటా కంపెనీ డజన్ల కొద్దీ మాజీ ట్విట్టర్ ఉద్యోగులను ‘కాపీక్యాట్’ యాప్‌ని రూపొందించడానికి నియమించుకుందని లేఖలో ఆరోపించారు. ఈ ఉద్యోగులలో కొందరు ఇప్పటికీ ట్విట్టర్ వ్యాపార రహస్యాలు, రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్నారని, వారు ట్విట్టర్ డాక్యుమెంట్లను, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను తమ దగ్గరే ఉంచుకొని ఉండవచ్చని లేఖలో ఆరోపించారు. మెటా తన వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా స్వాధీనపరచుకోవడంపై ట్విట్టర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ట్విట్టర్ మాజీ ఉద్యోగులెవ్వరూ థ్రెడ్స్‌పై పనిచేయడం లేదట :
మాజీ-ట్విట్టర్ ఉద్యోగులు మెటాలో భాగమైనట్లు నివేదికలు ఉన్నప్పటికీ.. మెటా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆండీ స్టోన్ పేర్కొన్నట్లుగా.. వారిలో ఎవరూ ప్రస్తుతం థ్రెడ్స్‌పై పని చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే, బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్‌లో కొంతమంది మాజీ ట్విట్టర్ ఉద్యోగులు మెటాలో చేరారని గతంలో పేర్కొంది. మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు.. దాదాపు 80 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. ఆ తర్వాత ట్విట్టర్ ఇంజనీర్ ఉద్యోగుల్లో 7,800 మంది నుంచి 600 కన్నా తక్కువ ఇంజనీర్లకు చేరుకుంది. చాలా మంది ఉద్యోగులను తొలగించడం బాధాకరమైన నిర్ణయమని మస్క్ అప్పట్లోనే అంగీకరించాడు.

Threads War _ First he fired Twitter engineers, now Elon Musk is planning to sue company that allegedly hired them
మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ అనేక వివాదాస్పద మార్పులకు గురైంది. ఇందులో తక్కువ కంటెంట్ మోడరేషన్ నియమాలు, పేమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రవేశపెట్టారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ట్విట్టర్లో గందరగోళ పరిస్థితి కారణంగా.. మెటా ఉద్యోగులకు ప్రత్యర్థి యాప్ (Threads)ను అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని అందించింది. థ్రెడ్స్, మెటా కొత్త యాప్ అధికారికంగా లాంచ్ అయిన వెంటనే అత్యంత ప్రజాదరణ పొందింది.
24గంటల్లోనే 30 మిలియన్ల మంది యూజర్లు :
మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటన ప్రకారం.. మొదటి 24 గంటల్లోనే దాదాపు 30 మిలియన్ల సైన్-అప్‌లను పొందినట్లు నివేదించింది. ఈ క్రమంలోనే మస్క్ న్యాయవాది చేసిన ఆరోపణలతో సోషల్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో ప్రధాన టెక్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టు అయింది. మెటా, మస్క్ క్యాంపుల మధ్య ఆరోపణలతో థ్రెడ్స్ యాప్, ట్విట్టర్ భవిష్యత్తుపై ఎంతవరకు ప్రభావం ఉంటుంది? రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమ దిగ్గజాల మధ్య కొనసాగుతున్న పోటీని మరింత ప్రభావితం చేయగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.