Tim Cook : ఢిల్లీకి టిమ్ కుక్ ఆగయా.. ఆపిల్ రెండో స్టోర్ రెడీ.. వచ్చి రాగానే ఆయన ఏం చేశారంటే?

Tim Cook : దేశ రాజధాని ఢిల్లీకి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO) చేరుకున్నారు. ఏప్రిల్ 20న ఆపిల్ రెండో స్టోర్‌ను కుక్ ప్రారంభించనున్నారు. ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్న ఆయన ఏం చేశారంటే..?

Tim Cook : ఢిల్లీకి టిమ్ కుక్ ఆగయా.. ఆపిల్ రెండో స్టోర్ రెడీ.. వచ్చి రాగానే ఆయన ఏం చేశారంటే?

Apple Delhi Store _ Key things to know about Apple's second retail store in Delhi

Tim Cook : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫస్ట్ ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన తర్వాత.. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ (Tim Cook) ఏప్రిల్ 20, (గురువారం) దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆపిల్ రెండో స్టోర్‌ (Apple Delhi Store) ను ప్రారంభించనున్నారు. అంతకంటే ముందురోజున (ఏప్రిల్ 19న) టిమ్ కుక్ ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీకి వచ్చిన వెంటనే కుక్ ముందుగా లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్ సందర్శించారు. అక్కడి కళాకారుల చిత్రాలను చూసి అభినందించారు. ఢిల్లీలోని లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్ (Lodhi Art District) అద్భుతమైనదిగా కుక్ అభిప్రాయపడ్డారు. భారతీయ జీవితాన్ని శక్తివంతమైనదిగా తీర్చిదిద్దినందుకు (St+art India Foundation)కి అద్భుతమైన కళాకారులకు కుక్ అభినందనలు తెలియజేశారు.

అంతేకాదు.. ఐప్యాడ్‌లో కళాకారుల ఆర్ట్స్ ఎలా డిజైన్ చేశారో చూపించినందుకు అక్కడి సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2015 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మంది ప్రఖ్యాత స్ట్రీట్ కళాకారులను సెయింట్+ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్‌ని రూపొందించడానికి ఆహ్వానించింది. అందులో ఇప్పుడు విదేశీ పర్యాటకులు, అంతర్జాతీయ ప్రముఖుల కోసం రోజువారీ వ్యక్తులు సందర్శించే భారత మొదటి ఆర్ట్ డిస్ట్రిక్ట్‌గా అవతరించింది. ఈ సందర్భంగా నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం & హస్తకాల అకాడమీని కూడా సందర్శించిన కుక్ తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్ సందర్శించిన టిమ్ కుక్..

Read Also : Apple First Store In India : ముంబైలో ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్.. కస్టమర్లకు గ్రాండ్ వెల్‌కమ్..!

ఆపిల్ సీఈఓ కుక్.. భారత ఐకానిక్ కన్స్యూమర్ టెక్నాలజీ కంపెనీ మొదటి రిటైల్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముంబై సబర్బన్ BKCలోని మాల్‌లోని స్టోర్‌కు ఆపిల్ కస్టమర్‌లను ఆయన స్వాగతించారు. ఆపిల్ BKCలో ఆపిల్ మొదటి స్టోర్‌ను తెరిచినందుకు చాలా సంతోషంగా ఉందని అని ఆయన ట్వీట్ చేశారు.

Apple Delhi Store _ Key things to know about Apple's second retail store in Delhi

Tim Cook arrives in Delhi for Apple Saket opening, his first stop in national capital

వందలాది మంది కస్టమర్‌లు షాపింగ్ చేయడానికి లేదా స్టోర్ అనుభూతిని పొందడానికి వందలాది మంది క్యూ కట్టేశారు. భారత మార్కెట్లో ఆపిల్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత దేశంలో రెండు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీలో ఆపిల్ రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని నిర్ణయించింది.

అంతకుముందు.. భారత పర్యటనలో టిమ్ కుక్.. నటి మాధురీ దీక్షిత్, రవీనా టాండన్, మాస్ట్రో AR రెహమాన్ వంటి బాలీవుడ్ ప్రముఖులను కలుసుకున్నారు. పెరుగుతున్న మార్కెట్ వాటాతో పాటు ప్రొడక్టులపై భారత మార్కెట్‌కు కంపెనీ కట్టుబడి ఉందని కుక్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలవాలని కుక్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆపిల్, చైనీస్, కొరియన్ బ్రాండ్‌ల ఆధిపత్యంలో ఉన్న అత్యంత పోటీతత్వ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కేవలం 3 శాతం వాటాను కలిగి ఉంది.

అయితే, ఇటీవల అమ్మకాలలో అధిక వృద్ధిని సాధించింది. అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌‌లో ఆపిల్ తన సరఫరా గొలుసును చైనాకు మించి విస్తరించాలని భావిస్తోంది. దేశం నుంచి ప్రొడక్టులు లేదా స్పేర్ పార్ట్స్ సోర్సింగ్‌ను విస్తరించాలని చూస్తోంది. ఆపిల్ దేశంలో 2,500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. యాప్ ఎకోసిస్టమ్ ద్వారా దేశంలో 10 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసింది.

Read Also : Apple Delhi Store : ఏప్రిల్ 20న ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలివే..!