Recycle with Respect: 15,000 వాహనా సామర్థ్యం కలిగిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీని ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ

ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ‘‘పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో, వాటిని పచ్చటి చేయడంతో పాటు మరింత ఇంధన సామర్థ్య వాహనాలతో భర్తీ చేయడం ద్వారా దేశంలో కార్బన్ అవశేషాలను తగ్గించడం..

Recycle with Respect: 15,000 వాహనా సామర్థ్యం కలిగిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీని ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ

Union Minister Gadkari inaugurates 15,000 vehicle capacity registered vehicle scrapping facility

Recycle with Respect: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, ఈరోజు రాజస్థాన్‌లోని జైపూర్‌లో మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ Re.Wi.Re – Recycle with Respect యూనిట్‭ను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ప్రారంభించారు. ఈ యూనిట్‭లో యేడాదికి 15,000 వాహనాల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ ఒక ప్రటకనలో పేర్కొంది. జీవితాంతం వాహనాలను సురక్షితమైన, స్థిరమైన ఉపసంహరణ కోసం పర్యావరణ అనుకూల ప్రక్రియలతో ప్రపంచ స్థాయిని అనుసరిస్తుందని, అన్ని బ్రాండ్‌ల ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను స్క్రాప్ చేయడానికి ఇది అభివృద్ధి చేయబడిందతీ టాటా మోటార్స్ ప్రతినిధి పేర్కొన్నారు.

Manish Sisodia: పదవులకు రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్.. ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

కాగా, ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ‘‘పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో, వాటిని పచ్చటి చేయడంతో పాటు మరింత ఇంధన సామర్థ్య వాహనాలతో భర్తీ చేయడం ద్వారా దేశంలో కార్బన్ అవశేషాలను తగ్గించడం లక్ష్యంగా “నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ’’ని ప్రవేశపెట్టాము. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో సమానంగా ఈ నాణ్యమైన సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు టాటా మోటార్స్‌ని నేను అభినందిస్తున్నాము. మేము భారతదేశాన్ని మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో వాహన స్క్రాపింగ్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నాము. భారతదేశంలో ఇలాంటి అత్యాధునిక స్క్రాపింగ్ మరియు రీసైక్లింగ్ యూనిట్లు మరిన్ని అవసరం’’ అని అన్నారు.

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ దెబ్బ.. ఐపీఎల్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం?