బడ్జెట్ 2020 : కొత్త ఆదాయపన్ను విధానం ఎంచుకుంటే మీకు నష్టమే!

వేతన జీవులు, ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త వినిపించారు. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించారు. వ్యక్తిగతంగా పన్నులు

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 11:24 AM IST
బడ్జెట్ 2020 : కొత్త ఆదాయపన్ను విధానం ఎంచుకుంటే మీకు నష్టమే!

వేతన జీవులు, ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త వినిపించారు. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించారు. వ్యక్తిగతంగా పన్నులు

వేతన జీవులు, ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త వినిపించారు. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించారు. వ్యక్తిగతంగా పన్నులు చెల్లించే విధానం మరింత సరళతరం చేస్తున్నట్టు ప్రకటించిన నిర్మలా సీతారామన్… కొత్త పన్నుల విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విధానంతో పాటు కొత్త విధానం కూడా అమలులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు రెండింట్లో ఏదో ఒక విధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆదాయం ఎంతో వెల్లడించి పన్ను చెల్లించాల్సి ఉంటే అంత శాతం పన్ను చెల్లిస్తే చాలు. అదే పాత విధానంలో మినహాయింపులన్నీ పొందొచ్చు.

బడ్జెట్ లో కొత్త ఆదాయపు పన్ను శ్లాబులు, తక్కువ రేట్లు ప్రతిపాదించారు. ఈ ఆదాయపు పన్ను రేట్లు ఆప్షనల్. అంటే కొన్ని మినహాయింపులు, కొన్ని తగ్గింపులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి. ఉపశమనాలు, మినహాయింపులు వదులుకునే వారికి కొత్త ఆదాయపు పన్ను రేట్లు గణనీయంగా తగ్గుతాయని కేంద్ర మంత్రి నిర్మల అన్నారు. వచ్చే 2021-22 మదింపు సంవత్సరం లేదా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయి. ఈ పన్ను సంస్కరణలతో ప్రభుత్వంపై వార్షికంగా రూ.40వేల కోట్ల భారం పడనుంది.

కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబ్స్ చూస్తే.. 
* రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5% పన్ను
* రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10% పన్ను (గతంలో 20శాతం పన్ను)
* రూ.7.5 లక్షల నుంచి రూ.లక్షల వరకు 15% పన్ను (గతంలో 20శాతం పన్ను)
* రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20% పన్ను (గతంలో 30శాతం పన్ను)
* రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25% పన్ను (గతంలో 30శాతం పన్ను)
* రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాలి

కొత్త పన్ను విధానం చర్చకు దారితీసింది. దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. కొత్త పన్ను విధానంపై ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త పన్ను విధానం వల్ల ట్యాక్స్ పేయర్లకు నష్టమే తప్ప లాభం లేదంటున్నారు. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ రేటు తగ్గించారు, దీని వల్ల ఊరట లభిస్తుందని కేంద్రం చెబుతున్నా.. వాస్తవంగా మాత్రం నష్టమే ఎక్కువ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కొత్త పన్ను విధానంతో కలిగే నష్టాలు:
* ట్రావెల్ అలవెన్స్ మినహాయింపు కోల్పోతారు. గతంలో వేతన జీవులకు నాలుగేళ్లలో రెండు సార్లు ట్రావెల్ అలవెన్స్ మినహాయింపు పొందే అవకాశం ఉంది.
* జీతంలో భాగంగా వేతన జీవులకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ ను ట్యాక్స్ కింద పరిగణిస్తారు.
* వేతన జీవులకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు కోల్పోతారు.
* సెక్షన్ 16 కింద ఇచ్చే వినోద అలవెన్స్, వృత్తి పన్ను కోల్పోతారు.

* హౌసింగ్ లోన్ పై కట్టే వడ్డీపై రాయితీ కోల్పోతారు. సెక్షన్ 24 కింద ఈ రాయితీ ఇస్తున్నారు.
* సెక్షన్ 57 కింద ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ రూ.15వేలు డిడక్షన్ కోల్పోతారు. 
* సెక్షన్ 80సీ కింద ఇచ్చే డిడక్షన్లు కోల్పోతారు. (ఫండ్ కాంట్రిబ్యూషన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్, స్కూల్ ట్యూషన్ ఫీజు).
* సెక్షన్ 80డీ కింద ఇప్పటివరకు పొందుతున్న మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం డిడెక్షన్ కోల్పోతారు.

* సెక్షన్ 80డీడీ, 80డీడీబీ కింద పొందే ట్యాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోలేరు.
* సెక్షన్ 80ఈ కింద ఎడ్యుకేషన్ లోన్ మీద చెల్లించే వడ్డీని క్లెయిమ్ చేసుకోలేరు.
* స్వచ్చంద సంస్థలకు ఇచ్చే విరాళాలపై రాయితీ కోల్పోతారు. ఇప్పటివరకు సెక్షన్ 80జీ కింద రాయితీ పొందుతున్నారు.

80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA సెక్షన్ల కింద పొందే రాయితీలన్నీ.. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే.. కోల్పోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు.

Also Read : బడ్జెట్ 2020 : పాన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్