Zomato: ‘జొమాటో’ పుట్టుక వెనుక కారణం ఏంటో తెలుసా?

గతంలో సిటీ ఏదైనా.. ఏ మూలాన టౌన్ అయినా సరే నచ్చింది తినాలి అంటే ఎవరైనా రెస్టారెంట్ కు వెళ్లి తినాలి.. లేదంటే పార్సిల్ తెచ్చుకోవాలి. కానీ, ఇప్పుడు పరిస్థితి మనకి తెలిసిందే. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఏదైనా మన వాకిట్లో వచ్చి తీరుతుంది. పైగా రెస్టారెంట్ ధరలకన్నా మించిన ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు కూడాను.

Zomato: ‘జొమాటో’ పుట్టుక వెనుక కారణం ఏంటో తెలుసా?

Zomato

Zomato: గతంలో సిటీ ఏదైనా.. ఏ మూలాన టౌన్ అయినా సరే నచ్చింది తినాలి అంటే ఎవరైనా రెస్టారెంట్ కు వెళ్లి తినాలి.. లేదంటే పార్సిల్ తెచ్చుకోవాలి. కానీ, ఇప్పుడు పరిస్థితి మనకి తెలిసిందే. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఏదైనా మన వాకిట్లో వచ్చి తీరుతుంది. పైగా రెస్టారెంట్ ధరలకన్నా మించిన ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు కూడాను. ఇప్పటికే మార్కెట్ లో చాలా రకాల ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులో ఉండగా… అందులో ప్రధానమైన వాటిలో జొమాటో (Zomato) కూడా ఒకటి.

అయితే.. ఒక్కో వ్యాపారం మొదలవడం వెనుక ఒక్కో రకమైన కారణం ఉంటుంది. అలానే జొమాటో (Zomato) వెనుక కూడా బలమైన కారణం అసంతృప్తి. జొమాటో (Zomato) ఫౌండర్ దీపిందర్ గోయల్ అసంతృప్తి నుండే ఈ బిజినెస్ మొదలైంది. గోయల్ ఐఐటీ చదువుతుండగా పిజ్జాను మహా ఇష్టంగా తినేవాడట. అయితే.. నచ్చిన పిజ్జా కోసం ఏ పిజ్జా సంస్థకు ఆర్డర్ చేసినా.. తనకు నచ్చినది రాకపోవడం.. ఆలస్యంగా రావడం రెండూ జరిగేవట.

ఇక, ఆ తర్వాత గోయల్ ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరగా అక్కడ క్యాంటీన్ మెనూలో చాలా తక్కువ ఐటమ్స్ ఉండడంతో తరచుగా బయటకు వెళ్లి తినిరావాలని అనిపించేదట. అలా ఆ రెండు అసంతృప్తులతో దీనికి పరిష్కారం కోసం ఆలోచన చేస్తుండగా.. పంకజ్ చద్దాతో పరిచయమైంది. అలా ఇద్దరూ కలిసి దగ్గర్లోని కేఫ్స్, రెస్టారెంట్స్ మెనూలతో ఫుడీబే (FoodieBay) అనే పేరుతో వీకెండ్ వెంచర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత రెండేళ్లలో జొమాటోగా మారి ఇలా ఇప్పుడు లక్ష కోట్ల టర్నోవర్ కు చేరుకుంది.