Xiaomi 13 Ultra Launch : అద్భుతమైన ఫీచర్లతో షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Xiaomi 13 Ultra Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. షావోమీ (Xiaomi 13 Ultra) చైనా సహా ఇతర మార్కెట్లలో లాంచ్ అయింది. షావోమీ నుంచి ఈ ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్ సేల్ సెంటర్లను ప్రారంభించనుంది.

Xiaomi 13 Ultra Launch : అద్భుతమైన ఫీచర్లతో షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Xiaomi 13 Ultra launched with four 50MP rear cameras, 90W fast charge

Xiaomi 13 Ultra Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. షావోమీ (Xiaomi 13 Ultra) చైనా సహా ఇతర మార్కెట్లలో లాంచ్ అయింది. షావోమీ నుంచి ఈ ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్ సేల్ సెంటర్లను ప్రారంభించనుంది. ఈ షావోమీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC, 2600నిట్స్ గరిష్ట ప్రకాశంతో 2K 12-బిట్ డిస్‌ప్లే, లెదర్ ఫినిష్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్, టాప్-నాచ్ ప్రీమియం ఫీచర్లతో వచ్చింది. 50-MP క్వాడ్ రియర్ కెమెరాలు లైకాచే సపోర్టు అందిస్తాయి. షావోమీ 12S అల్ట్రా ఫోన్ ద్వారా అద్భుతమైన ఫోటోగ్రఫీని పొందవచ్చు.

అయినప్పటికీ, భారతీయ మార్కెట్లో ఎప్పుడు సేల్‌కు అందుబాటులోకి వస్తుందో రివీల్ చేయలేదు. ఈ కొత్త (Xiaomi 13 Ultra) సమీప భవిష్యత్తులో భారత్‌కు వస్తుందని భావిస్తున్నారు. లేటెస్ట్ షావోమీ (Xiaomi 13) అల్ట్రా ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. షావోమీ 13 Ultra ఫోన్ ధర వివరాలను వెల్లడించింది. (RMB 5,999) అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ.71,600 వరకు ఉంటుంది. బేస్ 12GB + 256GB స్టోరేజ్ మోడల్ ధర మాత్రమే.. అదే..16GB + 512GB మోడల్ ధర RMB 6499 (సుమారు రూ. 77,600) వరకు ఉంటుంది.

Read Also : KTM 390 Adventure X : రూ. 2.8 లక్షలకే భారత్‌లోకి KTM 390 అడ్వెంచర్ X వచ్చేసింది..!

షావోమీ 13 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు ఇవే :
హైపర్-OIS, 8P లెన్స్, EIS, వేరియబుల్ ఎపర్చరు (f/1.9 నుంచి f/4.0)తో కూడిన 50-MP Sony IMX989 ప్రధాన సెన్సార్‌తో సహా వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ డివైజ్ అందిస్తుంది. అంతేకాదు.. 50-MP సోనీ IMX858 అల్ట్రావైడ్ కెమెరా, OISతో 50-MP సూపర్ టెలిఫోటో సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-MP టెలిఫోటో సెన్సార్‌తో కలిసి ఉంటుంది. Xiaomi 13 ప్రో మోడల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కానీ, జూమ్-ఫోకస్డ్ కెమెరా సెన్సార్‌ను అందించడం లేదు.

Xiaomi 13 Ultra launched with four 50MP rear cameras, 90W fast charge

Xiaomi 13 Ultra launched with four 50MP rear cameras, 90W fast charge

ఫ్రంట్ కెమెరాలో, 32-MP సెన్సార్‌ను అందిస్తుంది. షావోమీ 13 అల్ట్రా Qualcomm టాప్-నాచ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఈ డివైజ్ గరిష్టంగా 16GB LPDDR5X RAM, 1TB UFS 4.0 స్టోరేజీతో వస్తుంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో పెద్ద 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆపిల్, శాంసంగ్ వంటి పెద్ద టెక్ దిగ్గజాలు కాకుండా షావోమీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుంది.

LTPOకి సపోర్టుతో 6.73-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, P3 కలర్ గామట్, 1920Hz PWM డిమ్మింగ్, గరిష్టంగా 2600నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు అందిస్తుంది. షావోమీ యూజర్లకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఈ డివైజ్ కర్వడ్ ఎడ్జెస్ కలిగి ఉంది.

ఫ్రంట్ భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ లేయర్ కలిగి ఉంది.వెనుక ప్యానెల్ ప్రీమియం లెదర్ ఎండ్‌తో కలిగి ఉంది. ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. కొత్తగా లాంచ్ అయిన (Xiaomi 13 Ultra) ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, IR బ్లాస్టర్, స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. వాటర్, డెస్ట్ నిరోధకతకు IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

Read Also : Vivo X90 Sale in India : ఏప్రిల్ 26న వివో X90 సిరీస్ వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పటినుంచంటే?