పెళ్లి పేరుతో రూ.2లక్షలకు టోకరా

  • Published By: murthy ,Published On : October 24, 2020 / 11:35 AM IST
పెళ్లి పేరుతో రూ.2లక్షలకు టోకరా

man cheating woman pretext of marriage : పెళ్లి సంబంధం పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో పరిచయం అయి ఓ యువతి వద్దనుంచి రూ.2 లక్షలు కాజేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఎనలిస్ట్ గా పని చేసే యువతి వివాహం కోసం తన ప్రోఫైల్ ను  షాదీ.కాం వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుంది.

ఆ యువతి ప్రోఫైల్ చూసిన ఒక వ్యక్తి తాను బెంగుళూరులో ఉంటానని. ఎథికల్ హ్యాకర్ నంటూ పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు మంచిగా మాట్లాడుతూ ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి చదువులు, ఉద్యోగాలు, ఆదాయ వివరాలు తెలుసుకున్నారు.



ఇద్దరి కుటుంబ విషయాలు అన్నీ నచ్చటంతో  ఆ యువతి పెళ్లికి ఒప్పుకుంది. కొన్నాళ్ళు ఇద్దరూ చాటింగ్  చేసుకోవటం  మొదలెట్టారు. ఉన్నట్టుండి  ఒకరోజు ఆ యువకుడు యువతికి ఫోన్ చేసి….తన తండ్రికి సీరియస్ గా ఉందని… అస్పత్రిలో చేర్పించామని అర్జంట్ గా రూ.2 లక్షలు కావాలని అడిగాడు.

అప్పటికే కొన్నాళ్లనుంచి చాటింగ్ చేసుకుంటున్నారు…. త్వరలో పెళ్లి  కూడా చేసుకోబోతున్నామని ఆయువతి నమ్మి అతడికి రూ. 2లక్షలు పంపించింది. ఆతర్వాత  నుంచి యువకుడు సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వాట్సప్ లో సంప్రదించినా సరైన సమాధానం రాలేదు.



దీంతో మోసపోయనని గ్రహించిన యువతి శుక్రవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు కోల్ కత్తా కు చెందిన సైబర్ నేరగాళ్లు చేస్తుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.