Migrants Ship Sink In Greece : వలసదారులను తీసుకువెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి

గ్రీకు దేశంలో వలస దారులను తీసుకు వెళుతున్న ఒక పడవ నీటిలో మునిగి పోయింది. గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకి ఉత్తరాన ఉన్న ద్వీపంలో గురువారం సాయంత్రం ఈదుర్ఘటన చోటు  చేసుకుంది.

Migrants Ship Sink In Greece : వలసదారులను తీసుకువెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి

Migrant Ship Sink In Greece

Updated On : December 24, 2021 / 8:52 PM IST

Migrants Ship Sink In Greece :  గ్రీకు దేశంలో వలస దారులను తీసుకు వెళుతున్న ఒక పడవ నీటిలో మునిగి పోయింది. గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకి ఉత్తరాన ఉన్న ద్వీపంలో గురువారం సాయంత్రం ఈదుర్ఘటన చోటు  చేసుకుంది. పడవ ప్రమాదంలో సుమారు 11మంది  మరణించారని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. మరో 90 మందిని రక్షించారు.

రక్షించబడిన వారిలో 27 మంది పిల్లలు, 11మంది మహిళలు, 52 మంది పురుషులు ఉన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పడవ మునిగిపోయే సమయానికి  అందులో ఎంతమంది ఉన్నారో తెలియలేదని అధికారులు చెప్పారు. ఫోలె గ్రాండ్రోస్ ద్వీపంలో వలస దారులను తీసుకువెళ్తున్న డింగీ బోల్తా పడి ముగ్గురు మరణించిన మరుసటిరోజే ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read : Hyderabad : హైదరాబాద్ కేపీహెచ్‌బీ లో ఉద్రిక్తత-భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
అయితే ప్రజలు భద్రతను వెతక్కుంటూ ప్రమాదకరమైన ప్రయాణాలను చేస్తున్నారని ఐక్యారాజ్యసమితి శరణార్ధుల హై కమీషనర్ ప్రతినిధి అసిస్టెంట్ అడ్రియానో సిల్వెస్ట్రీ వ్యాఖ్యానించారు.