పంచకుల ఆశ్రమంలో ఇద్దరు బాలికలపై స్వామీజీ అత్యాచారం

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 05:00 AM IST
పంచకుల ఆశ్రమంలో ఇద్దరు బాలికలపై స్వామీజీ అత్యాచారం

హర్యానాలోని పంచకుల ఆశ్రమంలో దారుణం జరిగింది. ఓ స్వామిజీ ఇద్దరు బాలికలను బంధించి మూడురోజుల పాటు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఘటన పంచకుల పట్టణంలోని కల్కా ప్రాంతంలో సంచలనం సృష్టించింది. 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్ది ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు పంచకుల ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో బోధనలు చేస్తున్న స్వామిజీ ఇద్దరు బాలికలపై స్వామీజి కామపు కన్ను పడింది. వారిని బంధించి మూడు రోజుల పాటు పలు సార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బాలికలను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమంలో స్వామిజీని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను పంపించామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
వివారాల్లోకి వెళితే..అంబాలాకు చెందిన స్వామీ లక్ష్యానంద్ సరస్వతి (47) పంచకుల జిల్లా ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌పూర్ రాణి బ్లాక్‌లోని త్రిలోక్ పూర్ గ్రామంలో సనాటన్ సన్యాస్ ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలోని బడ్డి ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులతో కలిసి శనివారం (జనవరి 25) స్వచ్ఛంద సేవ చేయటానికి 15 సంవత్సరాల ఇద్దరు బాలికలు ఆశ్రమానికి వచ్చారు. 

బాలికలో ఒకరు 9th క్లాస్ చదువుతుండగా..మరొకరు స్కూల్ మానేశారు. వారి కుటుంబాలు బడ్డిలో నివసిస్తున్నాయి. వారు  స్వామీ లక్ష్యానంద్ సరస్వతి ఆశ్రమం గురించి తెలిసి సేవ చేసేందుకు వచ్చారు. సేవ చేస్తున్న బాలికలపై స్వామీజీ కన్నువేశాడు. అదను కోసం వేచి చూసాడు. ఓ రోజు బాలికల సోదరులు ఇద్దరు వేరే గదిలో నిద్రిస్తున్న సమయంలో స్వామీజీ బాలికలపై అత్యాచారం చేశారు. ఈ విషయం బైటకు చెబితే చంపి ఆశ్రమంలోనే పాతేస్తానని బెదిరించాడు. భయపడిపోయిన బాలికలిద్దరు నోరు మెదపలేదు. దాన్ని అదనుగా చేసుకుని లక్ష్యానంద్ సరస్వతి వారిపై మూడు రోజుల పాటు పదే పదే అత్యాచారానికి పాల్పడుతునే ఉన్నాడు. 

అలా మంగళవారం (జనవరి 28)న వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వారు తమ తల్లులకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో వారు కుటుంబ సభ్యులు పంచకుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలను పరీక్షించేందుకు పోలీసులు పంచకుల సివిల్ ఆసుపత్రిలో నిర్వహించిన బాలికల వైద్య పరీక్షలో అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బాలికలు తమ స్టేట్మెంట్లను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసినట్లు ఎసిపి బిష్ణోయ్ తెలిపారు. 

ఈ కేసుపై ఏసీపీ మాట్లాడుతూ..ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) లోని సెక్షన్ 376 (2) (ఎన్) (పదేపదే అత్యాచారానికి పాల్పడటం) 506 (క్రిమినల్ బెదిరింపు), బాలికల పిల్లల రక్షణ చట్టం,లైంగిక నేరాల (పోక్సో) చట్టం  కింద సెక్షన్ కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. 

ఆశ్రమంలో సోదాలు చేసి ప్రాంగణాన్ని లాక్ చేసామని ఏసిపి బిష్ణోయ్ తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. కాగా 2019లో  స్వామి లక్ష్యానంద్‌పై అత్యాచారం ఆరోపణల కేసు నమోదైందని బిష్ణోయ్ తెలిపారు. అలాగే ఆశ్రమంలో జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా పెట్టామనీ..వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. 

ఆశ్రమం గురించి
రాయ్‌పూర్ రాణిలోని చోటా త్రిలోక్‌పూర్ గ్రామంలో అర ఎకరానికి పైగా భూమిని ఏర్పాటు చేసి స్వామి లక్ష్యానంద్‌ సనాటన్ సన్యాస్ ఆశ్రమాన్ని పదేళ్లుగా నడుసుతున్నాడని స్థానికులు తెలిపారు.