Maharashtra: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి.. 15 మందికి గాయాలు

పూనే సమీపంలోని యవత్ గ్రామం దగ్గర హైవేపై ఒక ట్రక్కు నిలిచి ఉంది. ఉదయం ఐదు గంటల సమయంలో పూనే నుంచి వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ఈ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే, గాయపడ్డవారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది.

Maharashtra: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి.. 15 మందికి గాయాలు

Maharashtra: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన పూనే సమీపంలోని పూనే-షోలాపూర్ హైవేపై బుధవారం ఉదయం జరిగింది. పూనే సమీపంలోని యవత్ గ్రామం దగ్గర హైవేపై ఒక ట్రక్కు నిలిచి ఉంది.

Telangana: తెలంగాణలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభం.. గంభీరావుపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఉదయం ఐదు గంటల సమయంలో పూనే నుంచి వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ఈ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే, గాయపడ్డవారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. మృతదేహాల్ని బస్సు నుంచి వెలికితీశారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనతో కొద్దిసేపు రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు

అంతకుముందు రోజు కూడా పల్ఘార్ జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. కారు అతివేగంతో అదుపుతప్పడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ప్రమాదం జరిగింది.