Man Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ వ్యక్తి మృతి

ఇటీవలి కాలంలో వ్యాయామం చేస్తూ పలువురు మరణించారు. మహారాష్ట్రలోని పల్గర్ జిల్లాలో వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.

Man Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ వ్యక్తి మృతి

man died

Updated On : January 19, 2023 / 5:34 PM IST

Man Died : ఇటీవలి కాలంలో వ్యాయామం చేస్తూ పలువురు మరణించారు. జిమ్ లో వర్కవుట్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్రలో జరిగింది. వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన పల్గర్ జిల్లాలో రాత్రి చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రహ్లాద్ నికమ్(67) అనే వ్యక్తి రోజూ సాయంత్రం తన ఇంటికి సమీపంలోని జిమ్ లో వర్కవుట్స్ చేస్తుంటారు. రోజూలాగే బుధవారం జిమ్ కు వెళ్లారు. సాయంత్రం 7.30 గంటలకు వ్యాయామం చేస్తుండగా ప్రహ్లాద్ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు.

Software Engineer : సైక్లింగ్ చేస్తూ గుండె ఆగి మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

జిమ్ నిర్వహకులు ప్రహ్లాద్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రహ్లాద్ మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.