Gachibauli Car Accident : గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని మహిళ మృతి

ఎల్లా హోటల్ బయట చెట్లకు నీరు పోస్తున్న మహిళను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. కారు ఐదారు పల్టీలు కొట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Gachibauli Car Accident : గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని మహిళ మృతి

Accident

Updated On : March 19, 2022 / 1:48 PM IST

woman killed in car accident : జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన మరువకముందే హైరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిమ్స్ సమీపంలోని ఎల్లా హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు మహిళలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎల్లా హోటల్ బయట చెట్లకు నీరు పోస్తున్న మహిళను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. కారు ఐదారు పల్టీలు కొట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కారులో ఒక మహిళతోపాటు పరుషుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన తీవ్రతను బట్టి వారు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

MLA Shakeel Car : జూబ్లీహిల్స్‌‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. యాచకురాలిని ఢీ.. రెండున్నర నెలల చిన్నారి మృతి

కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ కారు ఢీకొట్టిన మహిళ మాత్రం మరణించింది. చనిపోయిన మహిళకు 50 ఏళ్లు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారు కోలుకున్న తర్వాత వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కారణంతో వేగంగా వెళ్లాల్సి వచ్చిందన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మహిళ చనిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఎల్లా హోటల్ లో హౌజ్ కీపర్ గా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె చెట్లకు నీరు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.