Catholic Church : క్యాథలిక్‌ చర్చిలో 5,000ల మంది చిన్నారులపై లైంగిక వేధింపులు..నిందితుల్లో చర్చి మతపెద్దలు

పోర్చుగీస్‌లోనే అతిపెద్ద క్యాథలిక్‌ చర్చిలో దాదాపు 5వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిపుణుల కమిటీలో నిర్ధారణ జరిగింది.

Catholic Church : క్యాథలిక్‌ చర్చిలో 5,000ల మంది చిన్నారులపై లైంగిక వేధింపులు..నిందితుల్లో చర్చి మతపెద్దలు

5,000 children sexually abused by Portuguese Catholic Church

Catholic Church : చర్చి అంటే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన దేవుని సన్నిథి. ఈలోకాన్ని రక్షించటానికి వచ్చిన ఏసుక్రీస్తు దేవాలయం. పవిత్రమైన దైవ సన్నిథిలో చిన్నారులపై అత్యంత హేయమైన చర్యలకు పాల్పడ్డారు దుర్మార్గులు. పోర్చుగీస్‌లోనే అతిపెద్ద క్యాథలిక్‌ చర్చిలో దాదాపు 5వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిపుణుల కమిటీలో నిర్ధారణ జరిగింది. చిన్నారులంటే ఏసుక్రీస్తుకు చాలా ఇష్టమని చెప్పే క్రైస్తవ మతపెద్దలే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. చిన్నపిల్లలను దేవుడితో సమానంగా చూడాల్సిన మత పెద్దలే ఈ దారుణానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించబడింది పోర్చుగీస్‌లోనే అతిపెద్ద క్యాథలిక్‌ చర్చిలో 4,815మంది జరిగిన చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన..ఈ చిన్నారుల్లో ఆడపిల్లల కంటే మగపిల్లలే ఎక్కువమంది బాధితులుగా ఉండటం గమనించాల్సిన విషయం. అంటే ఈ వేధింపులకు పాల్పడివారిలో ఎంతటి మృగత్వం దాగి ఉందో ఊహించుకోవచ్చు.

పోర్చుగల్ లోనే అతిపెద్ద క్యాథలిక్‌ చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపుల వ్యవహారంపై ఓ కమిటీ వేయగా సోమవారం (ఫిబ్రవరి 13,2023)న కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఈ దారుణ విషయాలు బయటపడ్డాయి. 70ఏళ్లలో క్యాథలిక్ చర్చిలో 4,815 మంది చిన్నారులు లైంగికంగా వేధింపులకు గురిఅయ్యారని నలుగురు మానసిక నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఓ సామాజిక కార్యకర్త నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ తేల్చింది. ఈ వేధింపులకు పాల్పడినవారిలో 77 శాతం మంది చర్చి మతపెద్దలే ఉన్నారని నివేదిక వెల్లడించింది.

క్యాథలిక్ చర్చితో పాటు ఆ చర్చికి సంబంధించి స్కూల్స్,హాస్టల్స్ వంటి ప్రాంతాల్లో ఈ లైంగిక వేధింపులు జరిగాయని తేల్చింది. ఈ వేధింపులకు గురి అయిన బాధితులంతా 10-14 ఏళ్ల వయస్సువారే. వీరిలో రెండేళ్ల పసివారు కూడా ఉన్నారని తేలింది. బాధితుల్లో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఎక్కువశాతం మంది మాత్రం మౌనంగా వహించారని తేలింది. లైంగిక వేధింపులకు గురయినవారిలో ఎక్కువశాతం మంది అబ్బాయిలే ఉండగా.. 47శాతం మంది ఆడపిల్లలున్నారని నివేదిక వెల్లడించింది.