దారుణం: యువతిపై సామూహిక అత్యాచారం

10TV Telugu News

నెల్లూరు: నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో దారుణం జరిగింది. ఓయువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. రాత్రి  రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫాంపై వేచి ఉన్న ప్రేమజంటను బెదిరించి యువతిని తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. అడ్డుకున్న యువకుడిని తీవ్రంగా కొట్టి యువతినిలాక్కెళ్లి  దారుణానికి ఒడిగట్టారు.  బాధిత యువతి వద్దని ప్రాధేయపడినా ఆమెను కొట్టుకుంటూ తీసుకువెళ్లిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 

కాకినాడకు చెందిన యువకుడు, విజయనగరం జిల్లాకు బాధిత యువతి శ్రీ సిటీలోని ఓ మొబైల్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత కాలంగా వీరిద్దరూ  ప్రేమించుకుంటున్నారు. తమ,తమ ఊళ్లకు వెళ్లేందుకు బొకారో ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కేందుకు ప్లాట్ ఫాం చివర ఉన్న బెంచి పైవారు కూర్చుని ఉండగా కామాంధులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని  పోలీసులు చెప్పారు.