Bihar : పేకాట ఆడుతున్నారని పోలీసు వెళితే..అతడినే చితకబాదిన యువకులు

మద్యం సేవిస్తూ..పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న ఓ పోలీసు గ్రామానికి వెళ్లగా...ఇక్కడ ఎందుకు వచ్చావంటూ..యువకులు ఆ పోలీసును చితకబాదారు.

Bihar : పేకాట ఆడుతున్నారని పోలీసు వెళితే..అతడినే చితకబాదిన యువకులు

Bihar Cop

Updated On : November 8, 2021 / 9:48 AM IST

Bihar Cop Tied : మద్యం సేవిస్తూ..పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న ఓ పోలీసు గ్రామానికి వెళ్లగా…ఇక్కడ ఎందుకు వచ్చావంటూ..యువకులు ఆ పోలీసును చితకబాదారు. చేతులు రెండు వెనక్కి కట్టేసి…మరి చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి..కేసు నమోదు చేసి..నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

Read More : Petrol And Diesel : స్థిరంగా చమురు ధరలు, హైదరాబాద్‌‌లో లీటర్ పెట్రోల్ రూ. 108

దీపావళి సందర్భంగా…తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి పీఎస్ పరిధిలో…ధరమ్ పూర్ గ్రామంలో మద్యం సేవించి..పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఎస్ఐ సీతారాం దాస్ అక్కడకు వెళ్లారు. పోలీసును చూసిన యువకులు రెచ్చిపోయారు. ఏఎస్ఐను చుట్టుముట్టారు.

Read More : Demonetisation: నోట్ల రద్దుకు ఐదేళ్లు.. అప్పటికీ, ఇప్పటికీ ఏమైనా మారిందా?

అనంతరం దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో దాడికి సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించారు. ఇతరులు ఆయనపై ముష్టిఘాతాలు కురిపించారు. తర్వాత వదిలేయడంతో..సీతారాం పోలీస్ స్టేషన్ కు చేరుకుని అసలు విషయం వెల్లడించారు. యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.