Britain : పెన్షన్ డబ్బుల కోసం.. స్నేహితుడి మృతదేహాన్ని రెండేళ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టిన వ్యక్తి..

డబ్బు కోసం ఎన్నో మాయలు, మోసాలు, దారుణాలు.. అమ్మాలేదు, అక్కాచెల్లీ లేదు. డబ్బుల కోసం సొంతమనుషుల్నే కడతేర్చుతున్నారు. రక్త సంబంధం లేదు..స్నేహ బంధం లేదు. డబ్బుల కోసం స్నేహితుడి శవాన్ని రెండేళ్లు ప్రిడ్జ్ లో పెట్టిన దారుణం బయటపడింది.

Britain : పెన్షన్ డబ్బుల కోసం.. స్నేహితుడి మృతదేహాన్ని రెండేళ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టిన వ్యక్తి..

Britain

Britain : రూపాయి రూపాయి నవ్వేం చేస్తావు అంటే పచ్చ ఇంట్లో చిచ్చు పెడతాను..అన్నదమ్ముల మధ్య గొడవపెడతాను అందట. ఇది ఓ సినిమాలో డైలాగ్. కానీ డబ్బుల కోసం కన్నతల్లిదండ్రుల్ని, కన్నబిడ్డల్నే చంపేస్తున్న రోజులివి. అక్కాలేదు చెల్లీ లేదు ఆఖరికి ఈ సృష్టిలో గొప్పదిగా చెప్పుకునే ‘స్నేహం’ కూడా డబ్బులకు అమ్ముడుపోతోంది. ప్రాణాల్ని నిలువునా తీసేస్తోంది. నమ్మించి నట్టేట ముంచిన స్నేహితులు చేసిన దగాలకు బలిపోయేవారు ఎందరో. స్నేహం ముసుగులో జరిగే దారుణాలు ఎన్నో. అలా ఓ వ్యక్తి స్నేహితుడికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం అతను చనిపోయాడనే విషయాన్ని దాచిపెట్టి శవాన్ని రెండు సంవత్సరాలు ఫ్రిడ్జ్ లో పెట్టి నెల నెలా వచ్చే పెన్షన్ డబ్బుల కోసం డ్రామాలాడాడు. స్నేహానికి వయస్సుతో సంబంధం లేదనేలా 71 ఏళ్ల వృద్ధుడితో స్నేహం చేసిన 52 ఏళ్ల వ్యక్తి చేసిన దారుణం ఇది. పెన్షన్ డబ్బుల కోసం వృద్ధుడిని మరణాన్ని దాచిపెట్టి రెండేళ్లు ఫ్రిడ్జ్ లో పెట్టి నెలనెలా అతనికి వచ్చిన పెన్షన్ డబ్బుల్ని కాజేసిన ఘటన బ్రిటన్ లో బయటపడింది.

Hyderabad : అందరు చూస్తుండగానే హైకోర్టు వద్ద వ్యక్తి హత్య..

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ సిటీలోని క్లీవ్ లాండ్ టవర్ లో జాన్ వెయిన్ రైట్ అనే 71 ఏళ్ల వృద్ధుడి నివసిస్తున్నాడు. అతని పొరుగింట్లో డేమియన్ జాన్సన్ అనే 52 ఏళ్ల వ్యక్తి నివసించేవాడు. దగ్గర దగ్గర ఇళ్లు కావటంతో ఇద్దరు స్నేహం పెంచుకున్నారు. ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఇద్దరు కనీసం రోజుకు ఒకసారైనా కలిసి మాట్లాడుకోవటం అలవాటైంది. ఈక్రమంలో 2018లో వెయిన్ రైట్ కు అనారోగ్యం చేసింది. అదే సంవత్సరంలో సెప్టెంబర్ లో చనిపోయాడు. కానీ వెయిన్ కోసం బంధువులు ఎవ్వరు రాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన డేమియన్ కు దుర్భుద్ది పుట్టింది. వెయిన్ చనిపోయాడనే విషయాన్ని ఎవ్వరికి తెలియనివ్వలేదు. కారణం అతనికి నెల నెలా పెన్షన్ వచ్చేది. ఆ డబ్బులు కాజేయటానికి డేమియన్ ప్లాన్ వేశాడు. వెయిన్ రైట్ మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టేశాడు. వెయిన్ రైట్ బతికే ఉన్నట్లు అందరినీ నమ్మిస్తూ ఆయనకు నెల నెలా వచ్చే పెన్షన్ కాజేశాడు.

అలా దాదాపు రెండేళ్లపాటు వెయిన్ రైట్ మృతదేహం ఫ్రీజర్ లోనే ఉంచేశాడు. కానీ తప్పు అయినా నేరమైనా ఎక్కువ కాలం దాగదు. అలా వెయిన్ రైట్ విషయం 2020 ఆగస్టులో బయటపడింది. పెన్షన్ కోసమే మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచాడనే ఆరోపణలతో జాన్సన్ ను అరెస్ట్ చేశారు. కానీ ఆ ఆరోపణలను జాన్సన్ అంగీకరించలేదు. కానీ టెక్నాలజీ అబద్దం ఆడదుగా.. షాపింగ్ చేయటానికి, వెయిన్ ఖాతా నుంచి తన ఖాతాకు డబ్బులు బదిలీ చేయటానికి 2018 లో జాన్సన్ వెయిన్ బ్యాంక్ కార్డుల్ని ఉపయోగించాడు. దీంతో అడ్డంగా బుక్ అయ్యాడు.

అలా రెండేళ్లపాటు వెయిన్ పెన్షన్ డబ్బుల్ని వాడేశాడు జాన్సన్. కానీ 2020లో దొరికిపోయాడు.పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా తాను వెయిన్ డబ్బుల్ని కాజేయలేదని ..వెయిన్ రైట్ తో తనకు జాయింట్ అకౌంట్ ఉందని, టెక్నికల్ గా ఆ ఖాతాలోని సొమ్ము మొత్తం తనకే చెందుతుందని వాదిస్తున్నాడు.ఈ కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈకేసు విచారణ జరుగగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈకేసు విచారణ నవంబర్ 7కు వాయిదా వేశారు న్యాయమూర్తి షాన్ స్మిత్.

Cyber Fraud : గిఫ్ట్‌లకు ఆశపడ్డారు, రూ.25లక్షలు పోగొట్టుకున్నారు.. సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం