Groom Escaped : పెళ్లి ముహూర్తం సమయానికి వరుడు పరార్
వధువు బంధువులు పెళ్లికి కావలసిన వస్తువులు తీసుకుని గుడికి చేరుకోగా... వరుడి జాడ లేదు. దీంతో కంగారు పడిన వధువు బంధువులు పెళ్లి కొడుకు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.

Groom 11zon
groom escaped in Bhadradri Kottagudem : పెళ్లి పెళ్లి ముహూర్తం సమయానికి ఓ వరుడు పరారయ్యాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూఏడెం జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో పెళ్లి ముహూర్తం నిర్ణయించి అన్ని రెడీ చేసుకున్నారు. పెళ్లికి కావలసిన సామాగ్రిని తీసుకుని వధువు వేదిక వద్దకు చేరుకుంది. సరిగ్గా ముహూర్తం సమయానికి పెళ్లి కుమారుడు హ్యాండ్ ఇచ్చాడు. ఫోన్ చేస్తే.. కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకున్నాడు.
చర్ల మండలం- దేవనగరం గ్రామానికి చెందిన ఓ యువతి .. వెంకటాపురం మండలం- ఏకన్నగూడెంకు చెందిన రాజ్‌కుమార్ ఏడాదిగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు నిలదీయడంతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇరు గ్రామాలకు చెందిన కుల పెద్దలు.. చర్ల మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పెళ్లి చేయాలని నిర్ణయించారు.
Palwancha Issue : వనమా రాఘవేంద్ర అరెస్టు…టీఆర్ఎస్ నుంచి సస్పెండ్
వధువు బంధువులు పెళ్లికి కావలసిన వస్తువులు తీసుకుని గుడికి చేరుకోగా… వరుడి జాడ లేదు. దీంతో కంగారు పడిన వధువు బంధువులు పెళ్లి కొడుకు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తాను ఫోన్ చేస్తే ఏవేవో కబుర్లు చెప్పి తప్పించుకున్నాడని వధువు కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం చేయాలంటూ వధువు చర్ల పోలీసులను ఆశ్రయించింది.