Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ

అత్యవసర సర్వీసు కోసం వెళ్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గేటు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహదారిపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి.

Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ

Cars Collided: అత్యవసర సర్వీసు కోసం వెళ్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గేటు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహదారిపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి. అయితే, అదే సమయంలో ఒక అంబులెన్స్ ఆ దారిలో వచ్చింది. అంబులెన్సుకు దారి ఇచ్చే ఉద్దేశంతో రోడ్డుపై వెళ్తున్న ఒక కారును డ్రైవర్ స్లోగా నడపడంతో వేగం తగ్గింది. ఉన్నట్టుండి ముందు కారు స్లో కావడంతో, వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు

మొత్తం ఏడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కాగా, కార్ల ప్రమాదం వల్ల ఈ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ క్లియర్ చేశారు.