Lalu Prasad Yadav: దాణా కేసులో లాలూకు 5 ఏళ్ల జైలు శిక్ష రూ.60 లక్షల జరిమానా

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల శిక్ష విధిస్తు సంచలన తీర్పు వెలువరించింది

Lalu Prasad Yadav: దాణా కేసులో లాలూకు 5 ఏళ్ల జైలు శిక్ష రూ.60 లక్షల జరిమానా

Lalu Prasad Yadav: 1996లో దేశంలో సంచలనం కలిగించిన దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. సోమవారం ఈ కేసు పై విచారణ చేపట్టిన రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు.. లాలూకే ఐదేళ్ల శిక్ష విధిస్తు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. 1990-1995 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రూ.950 కోట్ల విలువైన దాణా కుంభకోణం జరిగింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనలో 1996లో మొదటిసారి నమోదైన కేసులో మొత్తం 170 మందిపై అభియోగాలు నమోదు కాగా.. వారందరికీ శిక్ష పడింది. శిక్ష పడిన వారిలో 55 మంది వివిధ కారణాలతో ఇప్పటివరకు మృతి చెందారు కూడా.

Also read: V Hanumantha Rao: తప్పుడు ప్రచారంపై వీహెచ్ ఫిర్యాదు.. ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై ప్రశంసలు

అయితే ఈ దాణా కుంభకోణంలో ఈ 25 ఏళ్లలో మొత్తం ఐదు కేసులు నమోదు చేసింది సీబీఐ. ఈ ఐదు కేసుల్లోనూ లాలూ ప్రసాద్ దోషిగా తేల్చిన సీబీఐ న్యాయస్థానం 14 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. మూడున్నర సంవత్సరాలు పాటు జైలుశిక్ష అనుభవించిన అనంతరం అనారోగ్యం కారణాలతో ఇటీవలే పెరోల్‌పై విడుదలయ్యారు లాలూప్రసాద్. తాజాగా విచారించిన కేసులో 139. 35 కోట్ల రూపాయలను లాలూ.. డోరాండా ట్రెజరీ నుండి అక్రమంగా నగదు ఉపసంహరించినట్లుగా తేలింది. దీంతో ఆయన్ను దోషిగా తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఐదేళ్లు జైలుశిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించింది. మరో 36 మందికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది.

Also read; India Stock Market : ఉక్రెయిన్ -రష్యా ఎఫెక్ట్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు