Jagan-Chandrababu: హైదరాబాద్‌లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటికి జగన్, చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందగా..

Jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందగా.. ఆయన బౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తీసుకుని వచ్చారు. ఇప్పటికే పలువురు ప్రముకులు అపోలో ఆసుపత్రికి చేరుకోగా.. అక్కడి నుంచి ఇంటికి వస్తున్నారు.
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా మేకపాటి పార్ధివ దేహానికి నివాళులు అర్పించగా.. మరికాసేపట్లో తన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్న ఏపీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కాసేపట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి మృతదేహానికి ఆయన ఇంట్లో నివాళులు అర్పించనున్నారు.