Chennai: హోటల్లో ఫుడ్ సర్వ్ ఆలస్యమైందని ఓనర్ చెవి కోసేశారు!

ఎక్కడైనా హోటల్లో సర్వీస్ బాగుంటే సర్వ్ చేసిన అతనికి అదనంగా టిప్ ఇస్తారు. ఒకవేళ సర్వీస్ బాగాలేకపోతే యాజమాన్యానికి చెప్పి మందలిస్తారు. కానీ తమిళనాడులో ఇద్దరు యువకులు మాత్రం హోటల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఆలస్యంగా తెచ్చారని ఏకంగా యజమాని చెవి కోసేశారు.

Chennai: హోటల్లో ఫుడ్ సర్వ్ ఆలస్యమైందని ఓనర్ చెవి కోసేశారు!

Chennai

Chennai: ఎక్కడైనా హోటల్లో సర్వీస్ బాగుంటే సర్వ్ చేసిన అతనికి అదనంగా టిప్ ఇస్తారు. ఒకవేళ సర్వీస్ బాగాలేకపోతే యాజమాన్యానికి చెప్పి మందలిస్తారు. కానీ తమిళనాడులో ఇద్దరు యువకులు మాత్రం హోటల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఆలస్యంగా తెచ్చారని ఏకంగా యజమాని చెవి కోసేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్‌, శివ అనే ఇద్ద‌రు యువకులు సినిమా చూసేందుకు వెలిపాలయంలోని థియేట‌ర్‌కు వెళ్లారు. సినిమా మొద‌లు కావ‌డానికి టైం ఉండ‌టంతో స‌మీపంలోని హోట‌ల్‌కు వెళ్లారు.

ఎలాగూ సమయం ఉంది కదా అని టిఫిన్‌కు ఆర్డ‌ర్ ఇచ్చారు. అయితే.. ఒకపక్క సినిమా మొదలయ్యేందుకు సమయం అవుతుండగా స‌ర్వ‌ర్ వాళ్ళకి టిఫిన్ తీసుకురాలేదు. ఈ ఇద్దరి యువకుల కన్నా ముందువచ్చిన ప‌క్క టేబుల్ వారికి స‌ర్వ్ చేస్తున్న సర్వర్ తో ముందుగా గొడవ పెట్టుకున్నారు. ముందుగా మా ఆర్డర్ తెమ్మంటే పక్కవారికి తెస్తావా అంటూ గొడవ చేసి సర్వర్ మీద దాడి చేశారు. గొడవ కాస్త పెద్దదై హోటల్ యజమాని వచ్చి ఆ యువకుల మీద గొడవ పెట్టుకున్నాడు. గొడవ చేయకుండా బయటకు వెళ్లాలని ఆ యువకులను హెచ్చరించాడు.

అంతే.. ఆ హోటల్ యజమాని మీద కూడా ఆగ్రహించిన ఆ యువకులు ఇద్దరు కలిసి అతన్ని చితకబాదారు. అంతటితో ఆగకుండా కత్తి తీసుకొని యజమాని చెవి కోశారు. హోటల్ యజమాని చెవి భాగం నుండి ర‌క్తం కార‌డంతో స్థానికులు అతన్ని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. హోటల్లో పనిచేస్తున్న మిగతా సిబ్బంది స‌మాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణ్‌, శివ‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్ద‌రిపై ఇప్పటికే ఇతర స్టేషన్లలో పలు కేసులు ఉండగా ఇద్దరి మీద రౌడీ షీట్లు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Read: Self Charging Electric Car: ఎలక్ట్రిక్ కారే కానీ ఛార్జింగ్ అవసరం లేదు!