Chhattisgarh : మందుపాతర పేల్చిన మావోయిస్టులు
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతకానికి తెగబడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లా సోన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందు పాతర పేల్చారు.

Chhattisgarh
Chhattisgarh : చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతకానికి తెగబడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లా సోన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందు పాతర పేల్చారు. దీంతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు 53వ బెటాలియన్ కు చెందిన ఏఎస్ఐ రాజేంద్ర సింగ్ అక్కడి కక్కడే మరణించారు.
హెడ్ కానిస్టేబుల్ మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ను హెలికాప్టర్ లో రాయపూర్ తరలిస్తున్నామని ఎస్పీ సదానంద్ కుమార్ తెలిపారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
Also Read : Road Accident : ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం-20 మందికి గాయాలు
మరణించిన ఏఎస్ఐ రాజేంద్ర సింగ్ ఉత్తరాఖండ్ లోని తెహ్రీ గర్వాల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈరోజు ఉదయం గం. 8-30 సమయంలో సోన్ పూర్-ధోండారిబేడ గ్రామాల మధ్య జరుగుతున్న రోడ్డునిర్మాణ పనులలో కార్మికులకు భద్రత కల్పించటం కోసం ITBP 53వ బెటాలియన్ కు చెందిన భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన సంభంవించింది.