Cheruku Sudhakar : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా కొడుకును చంపుతానని బెదిరించారు : చెరుకు సుధాకర్

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకుకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన కొడుకుకు ఫోన్ చేసి భూతు పదాలతో దూషించి చంపుతామని బెదిరించారని ఆరోపించారు.

Cheruku Sudhakar : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా కొడుకును చంపుతానని బెదిరించారు : చెరుకు సుధాకర్

Cheruku Sudhakar

Updated On : March 11, 2023 / 1:57 PM IST

Cheruku Sudhakar : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకుకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన కొడుకుకు ఫోన్ చేసి భూతు పదాలతో దూషించి చంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఈ విషయంపై మాణిక్ రావు ఠాక్రేకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఏఐసీసీ పరిధిలోకి వెళ్లింది కనుక ఇక ఏమీ మాట్లాడనని చెప్పారు.

పార్టీకి నష్టం చేసే చర్యలు చేయబోనని తెలిపారు. క్షమాపణలు చెప్పాలని కూడా అడగనని అన్నారు. ఆయన వల్ల మునుగోడులో పార్టీకి నష్టం జరిగినా.. పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలిపారు. వెంకట్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తాను అడగలేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీని కోరామని తెలిపారు.

Telangana Congress : ‘ఐ డోంట్ కేర్ పీసీసీ కమిటీ ..ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

బడుగు, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డికి బెదిరింపు ఫోన్లు ఎవరు చేస్తున్నారో తెలియదన్నారు. నల్లగొండలో తాము ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు లేవని చెప్పారు. సోషల్ మీడియాలో ఎవరో ఏదో కామెంట్స్ చేశారని రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టారని వెల్లడించారు.

ఇటీవలే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆయనపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు. చంపుతానని బెదిరించారని, అసభ్యకరంగా మాట్లాడారని చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోమటిరెడ్డిపై ఐపీసీ 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చెరుకు సుధాకర్ కుమారుడిని ఫోన్ లో బెదిరించినట్లు కోమటిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.

Komatireddy Venkat Reddy : బూతులు తిడుతూ వారం రోజుల్లో చంపేస్తారంటూ బెదిరింపులు.. మరో వివాదంలో కోమటిరెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఐసీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు నిర్ధారించడం జరిగింది. ఇటీవల పీసీసీ ఉపాధ్యక్షుడుగా ఉన్న చెరుకు సుధాకర్ తనయుడికి ఫోన్ చేసి తన అనుచరులు నీ తండ్రిని చంపుతారని.. నిన్ను కూడా చంపుతారని కోమటరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అదేవిధంగా నీ హాస్పిటల్ కూడా ఉండదని బెదించడం, అసభ్యకరంగా మాట్లడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుహాన్ నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివిధ సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక ఆధారాలన్నీ సేకరించి, నిర్ధారించారు.

Komatireddy VenkatReddy Meets PM Modi : ప్రధానితో చర్చించిన అన్ని విషయాలు చెప్పలేను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం కాకుండా, నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసున నమోదు చేయాలని పార్టీలోని బీసీ సంఘాల బీసీ నేతలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు, వివిధ ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.