Delhi Police : అతిపెద్ద డ్రగ్ రాకెట్, రూ. 2 వేల 500 కోట్లు హెరాయిన్ పట్టివేత

రూ. 2 వేల 500 కోట్లు విలువ చేసే 350 కిలోల హెరాయిన్ ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి ఓ కంసైన్ మెంట్ ను తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఉన్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

Delhi Police : అతిపెద్ద డ్రగ్ రాకెట్, రూ. 2 వేల 500 కోట్లు హెరాయిన్ పట్టివేత

Delhi

Heroin Worth Rs 2,500 Crore : భారతదేశంలో అక్రమంగా మాదకద్రవ్యాల పంపిణీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్రమంగా తరలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. రూ. 2 వేల 500 కోట్లు విలువ చేసే 350 కిలోల హెరాయిన్ ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి ఓ కంసైన్ మెంట్ ను తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఉన్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు అప్ఘనిస్తాన్ నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి భారీస్థాయిలో హెరాయిన్ ను తీసుకొచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

Read More : Zika : కేరళలో జికా భయం, కర్నాటక రాష్ట్ర సర్కార్ అలర్ట్..మార్గదర్శకాలు జారీ

ఫరీదాబాద్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు, పంజాబ్ తో పాటు మరికొన్ని ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేశారని ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారి నీరజ్ ఠాకూర్ వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, వీరిలో ముగ్గురు హర్యానా రాష్ట్రానికి చెందిన వారు కాగా..మరొకరు ఢిల్లీ వాసిగా గుర్తించారు. వీరికి పాకిస్థాన్ డ్రగ్ ముఠాకు సంబంధాలున్నాయా ? అనే దానిపై ఆరా తీస్తున్నారు.