IAS Officer Puja Singhal:ఝార్ఖండ్ లో భారీ అవినీతి తిమింగలం: ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ ఇళ్లపై ఈడీ దాడులు

ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ నివాసాల్లో శుక్రవారం చేపట్టిన ఈ దాడులు శనివారం కూడా కొనసాగాయి.

IAS Officer Puja Singhal:ఝార్ఖండ్ లో భారీ అవినీతి తిమింగలం: ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ ఇళ్లపై ఈడీ దాడులు

Ed

IAS Officer Puja Singhal: ఝార్ఖండ్ రాష్ట్రంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. ఝార్ఖండ్ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారిని పూజా సింఘాల్, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడడంతో పాటు MNREGA నిధులను దారి మళ్లించారనే అభియోగాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ నివాసాల్లో శుక్రవారం చేపట్టిన ఈ దాడులు శనివారం కూడా కొనసాగాయి. పూజా సింఘాల్‌తో పాటు ఆమె సన్నిహితుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. దీంతో పాటు దేశంలోని 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. పూజా భర్త అభిషేక్ ఝాని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రాంచీలోని పల్స్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. అభిషేక్ ఝా వ్యాపార వ్యవహారాలు చూసే సీఏ సుమన్ కుమార్‌ను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Also read:Vizianagaram : పెళ్లి పేరుతో సహోద్యోగిని మోసం చేసిన సచివాలయ ఉద్యోగి

అంతకుముందు శుక్రవారం నాడు 25 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. 16 గంటల పాటు సాగిన ఈ దాడుల్లో పూజా సింఘాల్ సీఏ.. సుమన్ సింగ్ కి చెందిన హనుమాన్ నగర్ నివాసంలో రూ. 19.31 కోట్ల నగదు లభ్యమైంది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 150 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు కూడా లభ్యమయ్యాయి. ముజఫర్‌పూర్‌లోని పూజా సింఘాల్ మామ కామేశ్వర్ ఝా, అతని సోదరుడు మరియు ఢిల్లీలో నివసిస్తున్న తల్లిదండ్రులు మరియు సహచరుల ఇళ్లలోనూ ఈడీ బృందం దాడులు చేసింది. MNREGA స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో,..కోల్‌కతా, ముంబై, జైపూర్, గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్‌లలోని పూజా సింఘాల్ కు చెందిన ఇళ్లపై యాక్షన్ టీమ్ దాడులు చేసింది. అర్థరాత్రి వరకు జరిపిన ఈ దాడుల్లో ఈడీ అధికారులు భారీగా ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Also read:Rahul Gandhi: ఎన్ఎస్‌యూఐ నేతలతో రాహుల్ ములాఖత్

MNREGA స్కామ్‌లో జూనియర్ ఇంజనీర్ రాంవినోద్ సిన్హాను ఈడీ అధికారులు 2020లోనే కుంతిలో అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.4.25 కోట్ల విలువైన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ వరకు అవినీతి డబ్బులు వచ్చేవని రాంవినోద్ సిన్హా విచారణలో పేర్కొన్నాడు. ఆ సమయంలో పూజా సింఘాల్‌ కుంతీ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నారు. రూ.18 కోట్ల ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కుంభకోణం, గనుల కేటాయింపుల్లో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ దాడులు జరిగాయి. ప్రస్తుతం ఝార్ఖండ్ గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారిని పూజా సింఘాల్‌పై ఈడీ చర్యలు హఠాత్తుగా జరిగినది కాదు. ఝార్ఖండ్ రాష్ట్రంలో వేళ్లూనుకుపోయి ఉన్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీయసాగింది.

Also read:Camera in Swimming pool: స్విమ్మింగ్ పూల్ లో సీసీ కెమెరా

ఈక్రమంలోనే రాష్ట్రంలోని కళంకిత పోలీసు మరియు పరిపాలనా అధికారుల జాబితాను ఇవ్వాలంటూ ఝార్ఖండ్ గవర్నర్ ను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఈక్రమంలో నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు అధికారుల పేర్లను రాజ్‌భవన్‌కు పంపింది. వీరిలో రాంచీ డిప్యూటీ కలెక్టర్ ఛవీ రంజన్, ఎటిఐ డైరెక్టర్ కె. శ్రీనివాసన్, భవన నిర్మాణ కార్యదర్శి సునీల్ కుమార్, మనోజ్ కుమార్ ఉన్నారు. ఈ జాబితాలో మరో ఏడుగురు అధికారుల పేర్లను చేర్చిన రాజ్‌భవన్ వర్గాలు తమ వైపు నుంచి 11 మంది అధికారుల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపింది. రాజ్‌భవన్‌ జాబితాలో చేర్చిన అధికారుల్లో పూజా సింఘాల్‌ పేరు అగ్రస్థానంలో ఉంది. ఈక్రమంలోనే ఐఏఎస్ అధికారిని పూజా సింఘాల్ ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించింది.