Rahul Gandhi: ఎన్ఎస్‌యూఐ నేతలతో రాహుల్ ములాఖత్

తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేసిన ఎన్ఎస్‌యూఐ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Rahul Gandhi: ఎన్ఎస్‌యూఐ నేతలతో రాహుల్ ములాఖత్

Rahul Gandhi

Rahul Gandhi: తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేసిన ఎన్ఎస్‌యూఐ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న నేతలను రాహుల్ పరామర్శించి, వారికి భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తెలంగాణ ఉద్యమకారులతో కూడా భేటీ అయ్యారు. గద్దర్, హరగోపాల్, చెరుకు సుధాకర్, కంచె ఐలయ్యతోపాటు పలువురు ఉద్యమకారులు రాహుల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు.

Rahul in Warangal: అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: ప్రకటించిన రాహుల్ గాంధీ

చంచల్‌గూడ జైలులో విద్యార్థి నేతలతో భేటీ తర్వాత రాహుల్ గాంధీ, తాజ్ కృష్ణా హోటల్‌కు, అక్కడ్నుంచి సంజీవయ్య పార్కుకు బయలుదేరారు. అనంతరం గాంధీ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాహుల్.. గాంధీభవన్‌కు రావడం ఇదే తొలిసారి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో భేటీ అయ్యేందుకు అనుమతి లభించని సంగతి తెలిసిందే. దీంతో గాంధీభవన్‌‌లో విద్యార్థులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే రాహుల్, గాంధీభవన్ చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో గాంధీ భవన్ చుట్టుపక్కల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.