ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు : 10మంది మావోయిస్టులకు గాయాలు

ఛత్తీస్ గఢ్ లో హిక్మెట అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులు కలకలం రేపాయి.

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 03:47 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు : 10మంది మావోయిస్టులకు గాయాలు

ఛత్తీస్ గఢ్ లో హిక్మెట అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులు కలకలం రేపాయి.

ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో  ఎదురుకాల్పులు జరిగాయి. నారాయణ్ పూర్ జిల్లా హిక్మెట అటవీప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో దాదాపు 10 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో జవానుకు గాయాలు అయ్యాయి. డీఆర్ జీ , ఎస్ టీఎఫ్ బలగాలు హిక్మెట అటవీప్రాంతానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. డీఆర్ జీ , ఎస్ టీఎఫ్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. లొంగిపోవాలని సూచించినా మావోయిస్టులు వినలేదు. దీంతో ఇరువురు ఎదురు కాల్పులకు దిగారు.

 

ఇద్దరు మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన మావోయిస్టులు అటవీప్రాంతానికి పారిపోయారు. మావోయిస్టుల నుంచి భద్రతా బలగాలు భారీగా డంప్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ డీఐజీ సుందర్ రాజు తెలిపారు. ఈ ఘటన మావోయిస్టు నేతల్లో కలకలం రేపుతోంది.