Hyderabad : టెన్త్‌క్లాస్ విద్యార్ధిని ఇంట్లో చొరబడి గ్యాంగ్ రేప్ చేసిన తోటి విద్యార్ధులు

హైస్కూల్ చదివే వయస్సులోనే అత్యంత దారుణానికి ఒడిగట్టారు కొంతమంది విద్యార్థులు..తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తామేదో ఘనకార్యం చేసినట్లుగా అందంతా వీడియో తీసి తోటి విద్యార్ధులకు పంపించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని హయత్‌నగర్ మండలంలోని తట్టి అన్నారంలో జరిగింది. టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారినికి పాల్పడ్డారు. విద్యార్థిని ఇంట్లోకి చొరబడి ఐదురుగురు విద్యార్ధులు ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు.

Hyderabad : టెన్త్‌క్లాస్ విద్యార్ధిని ఇంట్లో చొరబడి గ్యాంగ్ రేప్ చేసిన తోటి విద్యార్ధులు

Hyderabad  : హైస్కూల్ చదివే వయస్సులోనే అత్యంత దారుణానికి ఒడిగట్టారు కొంతమంది విద్యార్థులు..తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తామేదో ఘనకార్యం చేసినట్లుగా అందంతా వీడియో తీసి తోటి విద్యార్ధులకు పంపించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని హయత్‌నగర్ మండలంలోని తట్టి అన్నారంలో జరిగింది. టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారినికి పాల్పడ్డారు. విద్యార్థిని ఇంట్లోకి చొరబడి ఐదురుగురు విద్యార్ధులు ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

తట్టి అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే 10Th క్లాస్ విద్యార్ధినిపై తోటి విద్యార్ధులే అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసే సమయంలో రికార్డు చేశారు.ఈ వీడియోలను తోటి విద్యార్ధులకు షేర్ చేశారు. ఈ విషయం బయటకు చెబితే రేప్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని నిందితులు బాధితురాలిని బెదిరించారు.

కాగా..దేశ వ్యాప్తంగా ఆడపుట్టుకలకు భద్రత అనేదిలేకుండాపోతోంది. ఇంట్లో ఉన్నా..బయటకు వెళ్లినా ఏవైపు నుంచి ఎటువంటి ఆపద వస్తుందోననే భయమే. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ మహిళలపై అత్యాచారాలు, హింసలు వంటి ఘటనలపై కేసులు నమోదవుతునే ఉన్నాయి. నేరాల అదుపు చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు.కఠినమైన చట్టాలు ఉన్నా వాటి అమలు (పలు కేసుల్లో) మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది.