Chinese Manjha: సోదరి ఇంటికి వెళ్తూ.. చైనా మాంజా గొంతుకు చుట్టుకుని యువకుడి మృతి

చైనా మాంజా ఒక యువకుడి ప్రాణాలు తీసింది. సోదరిని కలిసేందుకు బైక్‌పై వెళ్తున్న అతడి గొంతు కోసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన అతడ్ని భార్య ఆస్పత్రికి చేర్చింది. కానీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Chinese Manjha: సోదరి ఇంటికి వెళ్తూ.. చైనా మాంజా గొంతుకు చుట్టుకుని యువకుడి మృతి

Chinese Manjha: రాఖీ పండుగ రోజు సోదరిని కలిసేందుకు వెళ్లిన యువకుడిని చైనా మాంజా బలితీసుకుంది. నిషేధిత మాంజా గొంతును కోయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నాగ్లోయ్‌లోని రాజధాని పార్క్ నుంచి విపిన్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై.. లోని ప్రాంతంలో ఉన్న సోదరిని కలిసేందుకు బయల్దేరాడు.

Karnataka: అధికారులతో గడిపితేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ఆరోపణ

రాఖీ పండుగ కావడంతో సోదరిని కలవాలనుకున్నాడు. అయితే, శాస్త్రి పార్క్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే, పదునుగా ఉన్న చైనా మాంజా అతడి గొంతుకు చుట్టుకుంది. ఈ మాంజాకు గాజుపొడి పూసి ఉండటంతో గొంతు చుట్టూ రక్తం కారుతూ తీవ్ర గాయమైంది. చుట్టుపక్కల ఉన్న వారి సహాయంతో విపిన్ భార్య అతడిని ఆస్పత్రికి చేర్చింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. విపిన్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇలా మాంజా తగిలి ఈ నెలలోనే మరో వ్యక్తి ఢిల్లీలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇది రెండో ఘటన. నిజానికి దేశంలో మాంజాపై నిషేధం ఉంది. చైనా నుంచి దిగుమతి అయ్యే దీనిని ఢిల్లీలో 2016లోనే నిషేధించారు. అయినప్పటికీ అక్రమంగా అమ్మకాలు సాగుతున్నాయి.

Basavaraj Bommai: అవయవదానానికి ముందుకొచ్చిన కర్ణాటక సీఎం, ఆరోగ్య శాఖా మంత్రి

దీనిపై ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి అమ్మకాల్ని నిషేధించేందుకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఢిల్లీ పోలీసుల్ని కోరింది. గాజు ముక్కల్ని పొడిగా చేసి, గట్టిగా ఉండే దారాలకు పూతగా వేస్తారు. ఆ గాజు ముక్కల పొడితో అవి పదునుగా తయారవుతాయి. సాధారణంగా ఇతర గాలిపటాల్ని తెంపేందుకు వీటిని వాడేవారు. అయితే, ఇవి గొంతుకు చుట్టుకుని ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు చెట్లల్లో, ఇండ్లల్లో ఇవి చిక్కుకోవడం వల్ల, వీటిలో చిక్కుకుని అనేక పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అందువల్ల ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించింది.