Banjara Hills : కారు బీభత్సం కేసులో నిందితులకు రిమాండ్

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం కేసులో నిందితులు రోహిత్, స్నేహితుడు సుమన్ కు రిమాండ్ విధించారు. అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం.2లో కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

Banjara Hills : కారు బీభత్సం కేసులో నిందితులకు రిమాండ్

Banjara Hills

Banjara Hills car accident case : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం కేసులో నిందితులకు రిమాండ్ విధించారు. కారు నడిపిన రోహిత్, స్నేహితుడు సుమన్ రిమాండ్ కు తరలించారు. అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం.2లో కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు రెయిన్ బో ఆస్పత్రి సిబ్బందిగా గుర్తించారు. రోడ్డు దాటుతున్న వారిని కారు (టీఎస్ 08హెచ్ఆర్3344) వేగంగా ఢీకొట్టింది. రోహిత్ గౌడ్ మద్యం సేవించి కారు నడిపినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్.. ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Omicron In India : భారత్ లో 23కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ముంబైలో మరో ఇద్దరికి సోకిన వైరస్

రెయిన్ బో హాస్పిటల్‌లో ఉత్తరప్రదేశ్ వాసి ఆదిత్య రాయ్ (23) ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తుండగా, ఒరిస్సాకు చెందిన దేవేందర్ దాస్ (29) అసిస్టెంట్ కుక్‌గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఒకటిన్నర సమయంలో రోడ్ దాటుతుండగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న TS08HR3344 పోర్ష్ కారు ఢీకొట్టింది.

ఆలివ్ విస్ట్రో పబ్ లో మధ్యం సేవించి అక్కడి నుండి బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ వైపు వెళుతుండగా కారు ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యేందుకు యత్నించగా జూబ్లీహిల్స్ పోలీసులు మార్గమధ్యలో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు కారు డ్రైవర్ ను అప్పగించారు.

Road Accident : మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దంపతుల ప్రాణాలు తీశాడు

ఢీ కొట్టిన కార్ లో రోహిత్ గౌడ్(27), సుమన్(29)లు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ 70శాతం ఆల్కహాల్ తీసుకున్నాడని, పక్కనే కూర్చొన్న సుమన్ 58శాతం ఆల్కహాల్ తీసుకున్నాడని రికార్డులు చెబుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.